ఎవరీ తీరత్ సింగ్ రావత్ ? ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలుగుతారా ?

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ని బీజేపీ హైకమాండ్ నియమించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో యేడాది ఉండగా ఈ ఎంపీని ఈ పదవికి సెలెక్ట్ చేసింది.

  • Publish Date - 12:47 pm, Wed, 10 March 21 Edited By: Anil kumar poka
ఎవరీ  తీరత్ సింగ్ రావత్ ? ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలుగుతారా ?

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ని బీజేపీ హైకమాండ్ నియమించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో యేడాది ఉండగా ఈ ఎంపీని ఈ పదవికి సెలెక్ట్ చేసింది. 56 ఏళ్ళ తీరత్ సింగ్ రావత్ గర్వాల్ నుంచి ఎన్నికైన పార్టీ ఎంపీ కూడా.. 2013-15 మధ్య కాలంలో ఉత్తరాఖండ్ బీజేపీ  చీఫ్ గా ,  అంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్ఛే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ ఎన్నికలు జరగనున్నాయి. నిన్న రాజీనామా చేసిన త్రివేంద్ర సింగ్ రావత్ మాదిరే ఈయన  కూడా నెమ్మదస్తుడు.. ప్రచార ఆర్భాటాలకు పోని ..’లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ ‘చేసే వ్యక్తి. ఈయన మాస్ లీడర్ కాదని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. కొన్నేళ్ల వరకు ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్న తాను..సంఘ్ ప్రచారక్ పదవిని కూడా నిర్వర్తించానని, త్రివేంద్ర సింగ్ రావత్ మంత్రివర్గ సభ్యుడిగా ఉన్నానని తీరత్ సింగ్ రావత్ తెలిపారు.

తనను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకు ఆయన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు, పార్టీ అధ్యక్షుడు జేపీ.నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు వస్తుందని తాను కలలోనైనా ఊహించలేదని ఆయన చెప్పారు. పార్టీకి నిరంతరం సేవ చేస్తూనే ఉంటానని ఆయన చెప్పారు. తీరత్ సింగ్ ఈ సాయంత్రం 4 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఈయన పార్టీని విజయావకాశాలకు చేరువ చేస్తారా అని విపక్ష కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒక రాష్ట్ర సీఎం బలహీనుడని  బీజేపీ హైకమాండ్ ఒప్పుకున్నట్టేనని, అందుకే త్రివేంద్ర సింగ్ రావత్ ని తొలగించారని, ఇక నూతన సీఎం పాలన ఎలా ఉంటుందో చూడాల్సిందేనని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత హరీష్ రావత్ వ్యాఖ్యానించారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

Visakha Steel plant privatisation : విశాఖ స్టీల్ ప్లాంట్‌ని పరిరక్షించుకుని తీరుతాం : అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్

హిమాచల్ ప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం.. చాంబా జిల్లా లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు మృతి, 13మందికి గాయాలు