కారు దిగిన దీదీ… బీజేపీ కార్యకర్తల పరుగో పరుగు…

వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఊహించని అనుభవం ఎదురైంది. వెస్ట్ మిడ్నాపూర్‌లో కొంతమంది యువకులు ఆమెను చూసి.. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. శనివారం మధ్యాహ్నం ఓ బహిరంగ సభలో ప్రసంగించేందుకు చంద్రకొండ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ జెండాలు పట్టుకుని రోడ్డుకిరువైపులా నిలబడిన కొందరు గ్రామస్తులు మమత కాన్వాయ్‌ని చూడగానే జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మమత […]

కారు దిగిన దీదీ... బీజేపీ కార్యకర్తల పరుగో పరుగు...
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: May 06, 2019 | 2:21 PM

వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఊహించని అనుభవం ఎదురైంది. వెస్ట్ మిడ్నాపూర్‌లో కొంతమంది యువకులు ఆమెను చూసి.. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. శనివారం మధ్యాహ్నం ఓ బహిరంగ సభలో ప్రసంగించేందుకు చంద్రకొండ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ జెండాలు పట్టుకుని రోడ్డుకిరువైపులా నిలబడిన కొందరు గ్రామస్తులు మమత కాన్వాయ్‌ని చూడగానే జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మమత వెంటనే తన డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి ఒక్కసారిగా డోర్ తీసి కిందికి దిగారు. ఆమె వేగంగా దిగడాన్ని చూసిన బీజేపీ కార్యకర్తలు పరుగులు తీశారు. ఎందుకు పారిపోతున్నారని మమత అడిగినా వారు ఆగలేదు. ఇలా రండని పిలిచినా దగ్గరకు రాలేదు. వీళ్లంతా చాలా తెలివైనవారని, తన నుంచి తప్పించుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన ఆమె ఓ సభలో మాట్లాడుతూ, ఇక్కడ నినాదాలు చేస్తున్న వాళ్ల నోళ్లు మే 23 తరువాత మూతపడతాయని అన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత వారంతా ఇక్కడే ఉండాల్సి వస్తుందని అన్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన బీజేపీ, జై శ్రీరామ్ నినాదాలు వింటే మమతకు కోపమెందుకని, అదేదో వినకూడని మాటలు విన్నట్టుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించింది.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!