ఫ్యాన్ గుర్తుపై వైసీపీలో టెన్షన్?

విజయవాడ: వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్. ఇప్పుడు ఆ సింబల్ ఫ్రీజ్ కోబోతుందా? వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు సంచలనం రేపుతోంది. ఈ ఫిర్యాదుపై ఈసీ నుంచి వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు నోటీసు అందింది. దీంతో వైసీపీలో సింబల్ టెన్షన్ మోదలైందా? పార్టీ చేయి మారుతుందా? ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని రిజిస్టర్ చేసుకున్న శివకుమార్ అనే వ్యక్తి ద్వారా వైఎస్ఆర్ […]

ఫ్యాన్ గుర్తుపై వైసీపీలో టెన్షన్?
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 8:18 PM

విజయవాడ: వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్. ఇప్పుడు ఆ సింబల్ ఫ్రీజ్ కోబోతుందా? వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు సంచలనం రేపుతోంది. ఈ ఫిర్యాదుపై ఈసీ నుంచి వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు నోటీసు అందింది. దీంతో వైసీపీలో సింబల్ టెన్షన్ మోదలైందా? పార్టీ చేయి మారుతుందా? ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని రిజిస్టర్ చేసుకున్న శివకుమార్ అనే వ్యక్తి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ అధ్యక్షుడయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో శివకుమార్ పార్టీని తనకు ఇప్పించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ నుంచి జగన్‌కు నోటీసు అందింది. ఎన్నికల కమీషన్ నుంచి తనకు సానుకూలంగా ఉత్తర్వులు రాకపోతే సుప్రీం కోర్టుకు వెళతానని శివకుమార్ అంటున్నారు.

ఈ విషయంపై వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తమను ఎదుర్కోలేక టీడీపీ చేస్తున్న అనేక కుట్రల్లో ఇదొకటని కొట్టిపారేశారాయన. పార్టీ తమకే ఉంటుందని, సింబల్ కూడా తమకే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు, ఎన్నికల గుర్తు మీద ఈసీ నోటీస్ రావడం పార్టీలో కలకలం రేపుతోంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోననే టెన్షన్ మొదలైంది.