Revanth Reddy: కాంగ్రెస్‌ కార్యకర్తలే పీకేలు… ఏకే-47 తూటాలు.. గాంధీ భవన్‌లో జోష్ నింపిన కొత్త పీసీసీ చీఫ్ ప్రసంగం..

Revanth Reddy: కాంగ్రెస్‌ కార్యకర్తలే పీకేలు... ఏకే-47 తూటాలు.. గాంధీ భవన్‌లో జోష్ నింపిన కొత్త పీసీసీ చీఫ్ ప్రసంగం..
Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ వచ్చింది. కొత్త టీమ్‌ బాధ్యతలు తీసుకుంది. అట్టహాసంగా రేవంత్‌ బాధ్యతల స్వీకారం జరిగింది. ఆయన చేసిన మంత్రాంగం పని చేసింది. సీనియర్లంతా రావడంతో

Sanjay Kasula

|

Jul 07, 2021 | 5:44 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ వచ్చింది. కొత్త టీమ్‌ బాధ్యతలు తీసుకుంది. అట్టహాసంగా రేవంత్‌ బాధ్యతల స్వీకారం జరిగింది. ఆయన చేసిన మంత్రాంగం పని చేసింది. సీనియర్లంతా రావడంతో గాంధీభవన్‌ కళకళలాడింది. పార్టీ కార్యకర్తలే AK-47 బుల్లెట్లు, 2023లో అధికారమే టార్గెట్‌ అంటూ రేవంత్‌ ఇచ్చిన స్పీచ్‌ కేడర్‌లో మరింత ఉత్సాహం నింపింది. తెలంగాణ తల్లి సోనియమ్మనే అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంతమంది అడ్డుపడ్డా సోనియా మాత్రమే తెలంగాణ ఇచ్చారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు తీసుకున్న అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతీ ఇంట్లో సోనియా ఫోటో ఉండాలన్నారు. తెలంగాణ ద్రోహులు మంత్రులయ్యారని, తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు.  రెండేళ్లు కష్టపడితే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలంటే.. ప్రశాంత్‌ కిషోర్‌ని పెట్టుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారని, పాదరసంలాంటి  కార్యకర్తలే తమకు పీకేలు అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ కార్యకర్తలే పీకేలు… ఏకే-47 తూటాలని.. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞత చూపించాలన్నారు.

అంతకు ముందు.. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. గాంధీభవన్‌లో ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేవంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు రేవంత్‌ను ఆశీర్వదించారు పండితులు. పార్టీ సీనియర్లు, అధిష్టానం దూతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందరినీ సమన్వయం చేసుకోవడంలో రేవంత్‌ చేసిన మంత్రాంగం బాగానే పని చేసింది. కోమటిరెడ్డి మినహా సీనియర్లంతా కొత్త టీమ్‌ బాధ్యతల స్వీకారానికి హాజరయ్యారు. 2023లో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు రేవంత్‌.

ఇవి కూడా చదవండి: Revanth Reddy Oath: గాంధీభవన్‌లో సంబురాలు.. TPCC కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు..

Viral Video: పప్పీని తల్లి కోడి కుమ్మేసింది.. రక్కేసింది.. పొడిచేసింది.. ఇంతలా ఎందుకు చేసిందో తెలుసా.. అయితే ఇక్కడ చూడండి..

Pakistan: కుక్క తోక, పాకిస్తాన్ బుద్ధి ఒక్కటే! సరిహద్దులో మళ్లీ అదే పని చేస్తోంది..

CM Jagan Letter to PM Modi: మరోసారి ప్రధానికి ఏపీ సీఎం లేఖ.. ఈ సారి కూడా అదే అంశం.. కానీ 14 పేజీలు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu