Devineni Uma Arrest: హై టెన్షన్.. హైడ్రామా.. అర్ధరాత్రి దేవినేని ఉమాను అరెస్ట్..

అర్ధరాత్రి దేవినేని ఉమాను జి.కొండూరు అరెస్టు చేశారు.  దేవినేనిని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో హైడ్రామా నడిచింది. స్టేషన్‌ వద్ద భారీగా నాయకులు మోహరించడంతో...

Devineni Uma Arrest: హై టెన్షన్.. హైడ్రామా.. అర్ధరాత్రి దేవినేని ఉమాను అరెస్ట్..
Devineni
Follow us

|

Updated on: Jul 28, 2021 | 8:04 AM

కృష్ణా జిల్లా మైలవరం నియోజక వర్గంలో మైనింగ్ వివాదం రచ్చ రాజేసింది. రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడి కాస్తా.. ప్రత్యక్ష దాడి వరకు వెళ్లింది. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. ఆయన కారుపై దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో మైనింగ్‌ను పరిశీలించి తిరిగి వస్తుండగా అడ్డుకున్నారు. ఉమ కారుపై రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులపనే అని దేవినేని అరోపించారు.

అర్ధరాత్రి దేవినేని ఉమాను జి.కొండూరు అరెస్టు చేశారు.  దేవినేనిని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో హైడ్రామా నడిచింది. స్టేషన్‌ వద్ద భారీగా నాయకులు మోహరించడంతో దేవినేని ఉమాను తీసుకొస్తున్న పోలీసులు అక్కడికి అర కిలోమీటరు దూరంలోనే వాహనాన్ని నిలిపివేశారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి ఉమా అక్కడే కారులో ఆగిపోయారు. తాను ఫిర్యాదు ఇస్తానని, తీసుకోవాలని కోరినా పోలీసులు స్పందించలేదు. ఫిర్యాదు తీసుకునే దాకా తాను కదిలేది లేదని ఆయన భీష్మించుకుని అందులోనే కూర్చున్నారు. కారును తొలగించి, ఉమాను తరలించేందుకు పోలీసులు పెద్ద క్రేన్‌ను కూడా తెప్పించారు.

అది వీలు కాకపోవడంతో చివరకు కారు అద్దాన్ని తొలగించి.. ఆ తర్వాత కారు డోరు తెరిచారు. అనంతరం ఉమాను అదుపులోకి తీసుకుని తమ వాహనంలోకి ఎక్కించుకుని వేకువజామున 1.15 గంటలకు తరలించారు. దీంతో దాదాపు ఆరు గంటల ఉత్కంఠకు తెరపడింది. పోలీసుల చర్యపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వ్యక్తినే అరెస్టు చేయడం దారుణమన్నారు.

దేవినేని అరెస్టు అనంతరం విజయవాడ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కృష్ణా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, ఏలూరు రేంజ్‌ DOG మోహనరావు మాట్లాడుతూ.. ఉమా కుట్రపూరితంగా, ముందస్తు పథకంలో భాగంగా అలజడి సృష్టించేందుకే అక్కడికి వెళ్లారని వ్యాఖ్యానించారు. ఏ సెక్షన్‌ కింద, ఎంతమంది మీద కేసు నమోదు చేసిందీ తెలపలేదు.

మైలవరం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. ఆయన కారుపై దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిగిన మైనింగ్‌ను పరిశీలించి తిరిగి వస్తుండగా అడ్డుకున్నారు. ఉమ కారుపై రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులపనే అని దేవినేని అరోపించారు.

ఇది కూడా చదవండి: అమ్మో.. పాలు కాదు.. కాలకూట విషం.. కల్తీ మాఫియా గుట్టురట్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు

ఇది కూడా చదవండి: Karnataka New CM: కర్నాటక కొత్త సీఎం బసవరాజ బొమ్మై.. ఇవాళ ప్రమాణస్వీకారం..

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..