టీడీపీలో మరో సంక్షోభం… తెలుగు తమ్ముళ్లకు ఆగష్టు టెన్షన్!

ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైన టీడీపీకి ఇప్పుడు ఓ కొత్త సమస్య వేధిస్తోంది. ఇప్పటికే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్న తెలుగు తమ్ముళ్లకు.. ఆగష్టు నెల మరింత బీపీని పెంచుతోంది. గతం నుంచి టీడీపీని ఆగష్టు సంక్షోభం వేధిస్తూనే ఉంది. ఇప్పటికే వలసలతో కుదేలైన టీడీపీ మరో సంక్షోభానికి సిద్ధం అవుతుందా..? ఆగష్టు టెన్షన్‌ను తగ్గించుకోవడానికి తెలుగు తమ్ముళ్లు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. టీడీపీకి మొదటి నుంచి ఆగష్టు అచ్చిరాని కాలమే… పార్టీ […]

టీడీపీలో మరో సంక్షోభం... తెలుగు తమ్ముళ్లకు ఆగష్టు టెన్షన్!
Follow us

|

Updated on: Jul 19, 2019 | 3:23 PM

ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైన టీడీపీకి ఇప్పుడు ఓ కొత్త సమస్య వేధిస్తోంది. ఇప్పటికే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్న తెలుగు తమ్ముళ్లకు.. ఆగష్టు నెల మరింత బీపీని పెంచుతోంది. గతం నుంచి టీడీపీని ఆగష్టు సంక్షోభం వేధిస్తూనే ఉంది. ఇప్పటికే వలసలతో కుదేలైన టీడీపీ మరో సంక్షోభానికి సిద్ధం అవుతుందా..? ఆగష్టు టెన్షన్‌ను తగ్గించుకోవడానికి తెలుగు తమ్ముళ్లు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.

టీడీపీకి మొదటి నుంచి ఆగష్టు అచ్చిరాని కాలమే…

పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీకి ఆగష్టు సంక్షోభం వెంటాడుతూనే ఉంది. ఎప్పుడూ ఏదో ఒక ఎదురుదెబ్బ తగులుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు పార్టీ స్థాపించిన తర్వాత ఆగష్టు నెలలోనే రెండు సార్లు దెబ్బలు తగిలాయి. ఆయన ముఖ్యమంత్రి పదవిని రెండుసార్లు కోల్పోయారు. 1984 ఆగష్టులో నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటు చేసి ఎన్టీఆర్‌ను అధికార పీఠం నుంచి దింపేశారు.

ఇక 11 ఏళ్ళ తర్వాత 1995లో ఆగష్టు సంక్షోభం మళ్ళీ టీడీపీని కుదిపేసింది. అప్పుడు తిరుగుబాటుకు కథానాయకుడు ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఆ టైంలో జరిగిన వైస్రాయ్ స్కెచ్ పెద్ద సంచలమైంది. దీని తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదు. మరోవైపు 2000లో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోవడానికి ఆగష్టులో జరిగిన బషీర్ బాగ్ కాల్పులే కారణం. ఆ తర్వాత 2004లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో చంద్రబాబు ఆగష్టు ఘడియలు మంచి కాదని భావించి పార్టీ కీలక నిర్ణయాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మానేశారు.

ఇక ఇప్పుడు తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన తర్వాత 2019లో మరోసారి చంద్రబాబుకు ఆగస్టు సంక్షోభం తెగ ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే ఏపీలో టీడీపీని లేకుండా చేస్తామని బీజేపీ నాయకులు కంకణం కట్టుకుని కూర్చున్నారు. పార్టీలో వలసలు కూడా మొదలయ్యాయి. అటు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం కూడా టీడీపీనే టార్గెట్ చేసింది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లు ఎలా ఆగస్టు సంక్షోభం నుంచి బయటపడతారో వేచి చూడాలి.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!