బంద్ సజావుగా సాగేనా? ప్రభుత్వం ఏం చేయబోతుంది?

తెలంగాణలో  ఆర్టీసీ సమ్మెకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపడంతో శనివారం జరగబోయే రాష్ట్రవ్యాప్త బంద్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలువురు నేతలను అరెస్టు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని ప్రభుత్వంపై మరో తెలంగాణ ఉద్యమంలా ఆందోళన చేస్తామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చిరించారు. తాజా పరిస్థితులను చూస్తుంటే రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన విచారణలో హైకోర్టు ప్రభుత్వంపై అక్షింతలు […]

బంద్ సజావుగా సాగేనా?  ప్రభుత్వం ఏం చేయబోతుంది?
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 6:56 PM

తెలంగాణలో  ఆర్టీసీ సమ్మెకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపడంతో శనివారం జరగబోయే రాష్ట్రవ్యాప్త బంద్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలువురు నేతలను అరెస్టు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని ప్రభుత్వంపై మరో తెలంగాణ ఉద్యమంలా ఆందోళన చేస్తామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చిరించారు. తాజా పరిస్థితులను చూస్తుంటే రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

శుక్రవారం జరిగిన విచారణలో హైకోర్టు ప్రభుత్వంపై అక్షింతలు వేయడం ఆర్టీసీకార్మికుల విజయంగా భావిస్తున్నారు. పోరాడి సాధించిన రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం కూడా ఇందుకు నిదర్శంనంగా నిలిచింది. అయితే తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఏమాత్రం పట్టించుకోకండా చర్చలు జరపలేదని వాదిస్తున్న ఆర్టీసీ జేఏసీ.. శనివారం జరిగే బంద్ యధావిధిగా జరుగుతుందని ప్రకటించింది.

ఇదిలా ఉంటే రేపు జరగనున్న తెలంగాణ బంద్‌కంటే మందుగానే శుక్రవారం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఒకవైపు కోర్టులో వాదనలు జరుగుతుండగానే ఆయనను అరెస్టు చేయడం సరికాదని భావించారో ఏమో గాని విడిచిపెట్టారు. ఒకవేళ అరెస్టు చేస్తే మాత్రం ఇది తీవ్రస్ధాయిలో ఉంటుందని కూడా ప్రభుత్వం భావించి ఉండొచ్చు. ఇప్పటికే సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే శనివారం జరగబోయే బంద్ ఏ విధంగా ఉంటుందోఅనేది ఎవ్వరూ ఊహించనట్టుగా ఉంది. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. కార్మికులకు ప్రజలు అండగా నిలిస్తే వారిని అడ్డుకునేవారు ఎవరూ ఉండబోరంటూ కూడా న్యాయస్ధానం పేర్కొంది. ఇక ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు కూడా గమనిస్తుండటంతో .. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.