మిగిలింది ఎదురు చూపులే.. కెసీఆర్ అంతరంగం ఏంటంటే ?

అధికారంలో వున్నప్పుడు ఎవరి దర్జా అయినా తేలిపోయేది.. ఒక్కసారి అధికారానికి దూరమయ్యారా ఇక అంతే.. కళావిహీనమైపోవాల్సిందే. అందుకే తిరిగి చిన్నదో, పెద్దదో ఏదో ఒక పోస్టు కోసం వెంపర్లాడేందుకు సిద్దపడతారు రాజకీయ నాయకులు. సరిగ్గా ఇదే పరస్థితి తెలంగాణ రాష్ట్ర సమితిలోని కొందరు నేతలది. వీరంతా మాజీ మంత్రులు… గత ప్రభుత్వంలో హంగు ఆర్బాటంతో వెలిగిపోయారు. కానీ మొన్నటి ఎన్నికల్లో అదృష్టం కలిసి రాక ఓడిపోయారు. తాము ఓడిపోయినా తమ పార్టీనే అధికారంలోకి వచ్చింది కదా సీఎం […]

మిగిలింది ఎదురు చూపులే.. కెసీఆర్ అంతరంగం ఏంటంటే ?
Follow us

|

Updated on: Nov 08, 2019 | 12:04 PM

అధికారంలో వున్నప్పుడు ఎవరి దర్జా అయినా తేలిపోయేది.. ఒక్కసారి అధికారానికి దూరమయ్యారా ఇక అంతే.. కళావిహీనమైపోవాల్సిందే. అందుకే తిరిగి చిన్నదో, పెద్దదో ఏదో ఒక పోస్టు కోసం వెంపర్లాడేందుకు సిద్దపడతారు రాజకీయ నాయకులు. సరిగ్గా ఇదే పరస్థితి తెలంగాణ రాష్ట్ర సమితిలోని కొందరు నేతలది.
వీరంతా మాజీ మంత్రులు… గత ప్రభుత్వంలో హంగు ఆర్బాటంతో వెలిగిపోయారు. కానీ మొన్నటి ఎన్నికల్లో అదృష్టం కలిసి రాక ఓడిపోయారు. తాము ఓడిపోయినా తమ పార్టీనే అధికారంలోకి వచ్చింది కదా సీఎం తలచుకుంటే ఏదో ఒక పదవి దక్కక పోదా అని అనుకున్నారు. కానీ ఏడాది కావస్తున్నా అతీగతీ లేకపోవడంతో వారికి ఎదురు చూపులే దిక్కయ్యాయి. నామినేటెడ్ పోస్టుల కోసం ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్న ఆ సీనియర్ నేతల పరిస్థితి చెప్పలేక మింగలేక అన్నట్టుగా ఉందట.
తెలంగాణ ఏర్పడ్డ తరువాత కొత్త రాష్ట్రంలో తొలి కేబినెట్ లో స్థానం దక్కించుకొని ఆ ఆరుగురు నేతలు చరిత్రలో నిలిచిపోయారు. కానీ రెండోసారి అదే అదే పార్టీ అధికారంలోకి వచ్చిన వారికి మాత్రం కేబినెట్లో చోటు దక్కలేదు.  మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, మహేందర్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో వారికి కేబినెట్‌ చాన్స్‌ మిస్‌ అయింది. మరో ఇద్దరు కడియం, నాయిని నరసింహారెడ్డి లను కేసీఆర్‌ ఈ దఫా పక్కకు పెట్టారు. కేబినెట్ విస్తరణ సమయంలో వీరిలో కొంతమంది అలక పాన్పు ఎక్కారు.  అయితే వారికి త్వరలోనే మంచి నామినేటేడ్‌ పోస్టు ఇస్తామని లీకులు రావడంతో వీరంతా  సైలెంట్ అయ్యారు.
కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ లేదా ప్రభుత్వ సలహాదారుగా తమకు అవకాశం వస్తుందని ఈ నేతలు ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకూ ఏ పదవి రాలేదు. కేసీఆర్ నుంచి పిలుపు  రాలేదు. దీంతో వీరంతా ఇప్పుడు  ప్రగతిభవన్ బాటపట్టారు. అటు చిన్న బాస్ కేటీఆర్ తో టచ్ లో ఉంటూనే… కెసిఆర్ ప్రసన్నం కోసం ఎదురు చూస్తున్నారట.
ఈ ఆరుగురు నేతలే కాదు. మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి మాజీ ఛైర్మన్‌  స్వామి గౌడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పదవుల కోసం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నారు.  వీరిలో కొంతమంది ఎమ్మెల్సీలుగా పదవి కాలం దగ్గర పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో తమ పదవీకాలం   కొనసాగిస్తే చాలు అని కొందరు మాజీ మంత్రులు అనుకుంటున్నారట.
ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ని కలిసి పదవులు గురించి అడగలేక… మాజీ మంత్రిగా పనిచేసి ఎలాంటి పదవి లేకుండా ఉండలేక… బయటికి చెప్పుకోలేక మింగలేక ఉందట వారి పరిస్థితి. మరీ కేసీఆర్‌ వీరిని కరుణించి ఓపదవి ఇస్తారో లేదో చూడాలి.

400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్