ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ జిల్లాల పర్యటన ఖరారు.. ఏయే రోజు ఏయే జిల్లాల్లో పర్యటిస్తారంటే..

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటన అధికారికంగా ఖరారయింది. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన మేరకు..

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ జిల్లాల పర్యటన ఖరారు.. ఏయే రోజు ఏయే జిల్లాల్లో పర్యటిస్తారంటే..
Follow us

|

Updated on: Feb 26, 2021 | 5:52 PM

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటన అధికారికంగా ఖరారయింది. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన మేరకు 3 రోజుల్లో వరుసగా 13 జిల్లాల అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు ఎస్ఈసీ విమ్మగడ్డ రమేష్ కుమార్. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, సంసిద్ధతపై అధికారులు, రాజకీయ పార్టీలతో చర్చించి దిశానిర్దేశం చేయన్నారు ఎస్ఈసీ.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మూడు రోజుల పర్యటనలో భాగంగా 13 జిల్లాల అధికారులు , రాజకీయపార్టీలతో సమావేశాలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ , ఏర్పాట్లు , సంసిద్ధతపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు . తొలిరోజు పర్యటనలో భాగంగా తేది 27.02.2021 న మధ్యాహ్నం 1.15 గం.లకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు చేరుకొని మధ్యాహ్నం 2.15 గం.లకు తిరుపతి చేరుకుంటారు. అనంతరం 3.15 గం.ల నుండి 5.30 గం.ల వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు రాజకీయ పార్టీలతో గంట పాటు సమావేశమవుతారు. మరుసటి రోజు 28.02.2021 వ తేదీన ఉదయం 10.45 గం.లకు తిరుపతి విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి మధ్యాహ్నం 12 గంలకు విజయవాడ చేరుకుంటారు. అనంతరం 3.30 గం.ల నుండి 5.30 గం.ల వరకు పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు రాజకీయ పార్టీలతో గంట పాటు సమావేశమవుతారు.

తర్వాతి రోజు 01.03.2021 న మధ్యాహ్నం 12.20 గం.లకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.20 గం.లకు విశాఖ పట్టణం చేరుకుంటారు . అనంతరం 3.15 గం.ల నుండి 5.30 గం.ల వరకు శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్టణం , తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహిస్తారు . అనంతరం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు రాజకీయ పార్టీలతో గంట పాటు సమావేశమవుతారు . సమావేశం ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ విజయవంతమైన ఊపులోనే మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో పుర‌పాలిక ఎన్నిక‌లపై ప్రాంతాల వారీ స‌మావేశాల‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎస్ఈసీ ప్ర‌క‌టించింది. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం స‌న్న‌ద్ధ‌త కోస‌మే ప్రాంతాల వారీ స‌మావేశాల ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించింది.

ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అందించిన సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతం అయ్యాయని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలను కూడా జరపాలని నిర్ణయించామని, ఉద్యోగులు అందుకు సిద్ధం కావాలని, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

సాధారణ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిందని, 80 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం శుభ పరిణామమని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల నుంచి కూడా ఇదే విధమైన స్పందన వస్తుందని భావిస్తున్నట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఓటు వేయడం తమ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లోనే ఇప్పుడు కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అందరికీ తెలిసిన ప్రాంతాల్లోనే ఇవి ఉంటాయి కాబట్టి, పట్టణ ఓటర్లు తమ వంతు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిమ్మగడ్డ కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యఎప్పుడైనా వచ్చి ఓటేసి వెళ్లాలని అన్నారు.

Read more:

వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు.. టీడీపీ హయాంలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారన్న మంత్రులు