ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగుర వేస్తుందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పంచయతీ ఎన్నికలకు మించిన ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లో రాబోతున్నాయన్నారు. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 80శాతంకు పైగా గెల్చుకున్న వైయస్ఆర్ సీపీ అదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పుడు పార్టీ గుర్తు మీద జరగబోతున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో దానికి మించి ఫలితాలు సంపాదించి ఈ విజయం మొత్తాన్ని ముఖ్యమంత్రి శ్రీ జగన్‌కు కానుకగా సమర్పించాలని సజ్జల పిలుపునిచ్చారు.
గత రెండేళ్లలో రాష్ట్రంలో సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేనంతగా కొత్త ఒరవడి సృష్టించి, ప్రతి పేదవారి ఇంట్లో వెలుగు నింపిన జగన్ గారి విజన్ ను మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. పార్టీ నాయకుల నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల వరకు అందరూ సమన్వయంతో పనిచేయడంవల్లనే పంచాయతీ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించారు. అలానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంతా కలిసికట్టుగా పనిచేయాలి. పునాదులతో సహా టీడీపీ కుప్పకూలిపోయి, ఆఖరుకు చంద్రబాబు ఏకైక కోటగా చెప్పుకుంటున్న, కుప్పం కూడా బద్దలైపోయాక మతిస్థిమితం తప్పి.. రాజకీయంగా, ప్రజలకు సంబంధించిన అంశాలు వదిలేసి, వాళ్ల పార్టీ వారికే అర్ధం కానీ విధంగా, అల్రెడీ డీ మోరలైజ్ లో ఉన్నవారిని మరింత అగాథంలోకి నెడుతూ కొద్దిరోజులుగా చంద్రబాబు మాట్లాడుతున్న అసందర్భ ప్రేలేపనలు, సంధి ప్రేలేపనలు అందరు గమనిస్తున్నారు.
పార్టీ గుర్తు మీదే జరగని పంచాయతీ ఎన్నికల్లో, తన పరిధిలో లేని అంశాల మీద చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేసినపుడు లోకం అంతా నవ్వింది. దీనిమీద మా పార్టీ తరుపున అభ్యంతరాలు తెలిపాము. దీనిమీద సీఈసీకు కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. మళ్లీ ఈరోజు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసి, అదే ధోరణిలో మున్సిపాలిటీల పరిధిలో లేని అంశాలను, అవి చేయలేని పనులను పొందుపర్చి ఇవన్నీ మేం వస్తే చేస్తామని మళ్లీ ఒక 420 పని, మోసగాళ్ల పని చంద్రబాబు, ఆయన పార్టీ చేశారు. మేనిఫెస్టో పేరుతో ఒక పత్రం రిలీజ్ చేశారు, దీనిపై కూడా మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. 2014లో కూడా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో చెప్పినవి గవర్నమెంట్ లోకి వచ్చాక కూడా ఏమీ చేయలేదు. గవర్నమెంట్ లో ఉండి కూడా ఏమి చేయలేదు… ఇప్పుడు గవర్నమెంట్ లోకి వచ్చే ఛాన్స్ లేదు. ఆ తరువాత కూడా లేదని ఇప్పటి ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. మరి ఏ లెక్కన ఆ వాగ్దానాలు అమలు చేస్తారో చంద్రబాబు సమాధానం చెబితే బాగుంటుంది.
మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో.. ఎక్కడో ఒకచోట చెదురుమదురుగా గెలిస్తే(అదికూడా డౌటే), అక్కడ చేయలేని పనులను, తమ పరిధిలో లేని అంశాలను చేర్చి మేనిఫెస్టోలో పెట్టారంటే.. వీళ్ల బరితెగింపు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇంకా వీళ్ల మీద వీళ్లకు అపరితమైన విశ్వాసం ఉందా? జనం అమాయకత్వం మీద, ఓటర్ల అమాయకత్వం మీద చంద్రబాబుకు ఇంత భరోసా ఉందా? రిజక్ట్ చేసి చెత్త బుట్టలో వేసినా సరే.. లేక వీళ్ల ప్రపంచంలో వీళ్లు ఉన్నారా? అనే అనుమానం కలుగుతోంది. సీఎం జగన్ ఏ పథకాలైతే తీసుకువచ్చారో.. అంటే రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ దగ్గర నుంచి, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఒక కుటుంబ పెద్దగా చేయాల్సిన పనులన్నీ చేసి, ఆ ఇంట్లో మనిషిగా వారి బాగోగులను అన్నీ కోణాల్లో ఆలోచించి ప్రతి పేద కుటుంబంలో వెలుగులు నింపారు. ఆ వెలుగులు నింపే ప్రయత్నంలో ఈ రెండేళ్లలో శ్రీ జగన్ గారు చేసిన పనులన్నీ కూడా ఆయన్ను ప్రజల హృదయాలకు మరింత దగ్గర చేశాయి.
వీటన్నింటి ఫలితంగా ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇందులో అసహజం ఏమీ లేదు.. అత్యంత సహజమైన విషయం. అసహజమైనది చంద్రబాబు పెట్టుకున్న దురాశలే. ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రజలు తమకు ఓట్లు వేయాలని లేదా జగన్ ను పక్కనపెట్టాలని వారు కంటున్న పగటి కలలు చూస్తుంటే.. ఈ జన్మకు రావు. ఎందుకంటే, చంద్రబాబుకు వయస్సు అయిపోయింది. వచ్చే మూడేళ్ల వరకు ఏ ఎన్నికలు లేవు. కంప్లీట్ దుకాణం క్లోజ్ చేసుకుని వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని కనపడుతోంది. మాకైతే ఇష్టం లేదు. ప్రతిపక్షం ఉండాలి, ఎంతోకొంత ప్రజల కోసం పనిచేస్తే బాగానే ఉంటుంది. జనం కోసం పనిచేయాలని హితవు పలుకుతున్నాము.
వయసులో చిన్నవారైనా ప్రజల్లో ఉండి, పోరాడి, ప్రజల మన్ననలు పొంది, ప్రజలకు భరోసా ఇచ్చేలా ఎలా నిలబడ్డారో శ్రీ జగన్ గారిని చూసి నేర్చుకోవాలి. తండ్రికి ఎలానో వయసు అయిపోయింది కాబట్టి, కొడుకైనా కొంతలో కొంత రెండుశాతమైనా నేర్చుకోగలిగి, మిగిలి ఉన్న సీట్లకు ప్రతిపక్షంగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తే జనం ఆదరించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ, అసభ్యంగా మాట్లాడుతూ, వారికున్న రెండు మూడు ఛానెల్స్ ద్వారా ప్రచారం చేసుకుంటే, అదే సర్వస్వం అనుకుంటే వారి ఖర్మ అన్నారు సజ్జల.
Read more:
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జిల్లాల పర్యటన ఖరారు.. ఏయే రోజు ఏయే జిల్లాల్లో పర్యటిస్తారంటే..