Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు.. రాహుల్‌ జోడో యాత్రపై బీజేపీ నేతల సెటైర్లు

Rajasthan Congress Crisis: అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో తలనొప్పి వచ్చిపడింది. రాజస్థాన్‌ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం పగ్గాలు..

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు.. రాహుల్‌ జోడో యాత్రపై బీజేపీ నేతల సెటైర్లు
Sachin Pilot, Ashok Gehlot
Follow us

|

Updated on: Sep 26, 2022 | 11:40 AM

Rajasthan Congress Crisis: అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో తలనొప్పి వచ్చిపడింది. రాజస్థాన్‌ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం పగ్గాలు సచిన్‌ పైలట్‌కు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ససేమిరా అంటున్నారు. దీంతో గెహ్లాట్‌ వర్గీయులు ఒక్కసారిగా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్లు వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాహుల్‌ జోడో యాత్రను ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తోంది బీజేపీ. పాదయాత్ర కంటే ముందు రాజస్థాన్‌లో ఐక్యతను తీసుకురండి అంటూ సెటైర్లు వేస్తున్నారు బీజేపీ నేతలు.  రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. గతంలో గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ కలిసి రాహుల్‌గాంధీతో దిగిన ఓ ఫోటోను సైతం షేర్‌ చేశారు. ముందు వీరిద్దరిని కలపండి.. అంటూ సెటైర్‌ వేశారు. మరో వైపు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షేకావత్‌ కూడా స్పందించారు. శిబిరాల ప్రభుత్వం మరోసారి రిసార్టులకు వెళ్లేందుకు రెడీ అవుతోంది.. అంటూ ఎద్దేవా చేశారు. రాజస్థాన్‌లో తాజా పరిస్థితులను చూస్తుంటే రాష్ట్రపతి పాలన దిశగా సానసాగుతున్నట్లు అనిపిస్తోందంటూ బీజేపీ డిప్యూటీ నేత రాజేంద్ర రాథోడ్‌ అభిప్రాయపడ్డారు.

రాజస్థాన్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామాకు సిద్ధమైన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంత మంది నేతలపై కూడా చర్యలు తీసుకోవచ్చని సమాచారం. ఇప్పుడు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌లను పార్టీ నాయకత్వం ఢిల్లీకి పిలిపించింది. సీఎం గెహ్లాట్ ఢిల్లీ పర్యటన సమయం ఇంకా ఖరారు కాకపోవడంతో ఆయన జాతీయ అధ్యక్షుడి నామినేషన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అశోక్ గెహ్లాట్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలసి మొత్తం అభివృద్ధి గురించి తెలియజేయనున్నారు. ఈ సమావేశం తర్వాతే తదుపరి చర్యపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ ఎమ్మెల్యేలను కలవకుండానే వెనుదిరగాల్సి రావచ్చు. ఆయనను కలిసేందుకు ఎమ్మెల్యేలు నిరాకరించారు. ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత నేతలిద్దరూ హైకమాండ్‌కు నివేదిక సమర్పించనున్నారు. ఢిల్లీకి తిరిగి వచ్చే ముందు ఇద్దరూ అశోక్ గెహ్లాట్ మరియు పిసిసి చీఫ్‌లను కలవవచ్చు. గెహ్లాట్‌ మద్దతుగా 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొంత మంది స్వతంత్ర సభ్యులు ఉన్నారు. వీరంతా కూడా బస్సుల్లో స్పీకర్‌ సిసి జోషి నివాసానికి వెళ్లారు. రాజీనామా లేఖలను అందజేస్తారా ? లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను గెహ్లాట్‌ చేపడితే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించేందుకు ఆదివారం సాయంత్రం సీఎం నివాసంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. అనూహ్య రీతిలో రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆదివారం అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌.. సీఎంగా కూడా తానే కొనసాగాలని మొండికేయడంతో ఈ సంక్షోభం తలెత్తడానికి అసలు కారణం. అయితే సచిన్‌ పైలట్‌కు సీఎం కుర్చీని ఇచ్చేందుకు ఆయన ససేమిరా అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇలా ఒక్కసారిగా రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొనడంతో సంచలనంగా మారింది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో పోలిటికల్‌ వార్‌ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో ఇప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో పోలిటికల్‌ వార్‌ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!