Priyanka Gandhi: కాంగ్రెస్ కొత్త అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ..? చింతన్ శిబిరంలో హాట్ హాట్ చర్చ..

అధ్యక్షురాలిగా చేయాలనే డిమాండ్ తెరమీదికి వచ్చింది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా లేకుంటే ప్రియాంకను అధ్యక్షురాలిగా చేయాలని పార్టీ నేత ప్రమోద్​ కృష్ణం డిమాండ్​ చేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చల సందర్భంగా..

Priyanka Gandhi: కాంగ్రెస్ కొత్త అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ..? చింతన్ శిబిరంలో హాట్ హాట్ చర్చ..
Priyanka Gandhi Vadra
Follow us

|

Updated on: May 15, 2022 | 1:09 PM

కాంగ్రెస్ చింతన్ శిబిర్(Chintan Shivir) ముగింపు సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. చివరి రోజు మేధోమథనం కొనసాగుతోంది. వ్యవసాయ రంగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్​ పార్టీ కీలక నేతలు చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో దూరమైన సామాజిక వర్గాలను కలుపుకుపోయేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. ఇదిలావుంటే.. రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో కొనసాగుతున్న నవసంకల్ప చింతన శిబిరంలో రెండో రోజు పలు కీలక అంశాలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీని(Priyanka Gandhi) అధ్యక్షురాలిగా చేయాలనే డిమాండ్ తెరమీదికి వచ్చింది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా లేకుంటే ప్రియాంకను అధ్యక్షురాలిగా చేయాలని పార్టీ నేత ప్రమోద్​ కృష్ణం డిమాండ్​ చేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చల సందర్భంగా.. ఈ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు ఉత్తర ప్రదేశ్ నేతలు.  అజెండాలో లేని అంశాలు మాట్లాడవద్దని సూచించారు కమిటీ ఛైర్మన్ మల్లికార్జున్​ ఖర్గే వారిని వారించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌కు పగ్గాలు అప్పగించాలనే డిమాండ్‌ను కూడా ఈ సందర్భంగా కోరారు ప్రమోద్ కృష్ణం. అలాంటి చర్చలకు ఇక్కడ ఆస్కారం లేదంటూ మల్లికార్జున్‌ ఖర్గే మరోసారి అడ్డుకున్నట్లుగా సమాచారం.

మేధోమథనంతో ముగింపు..

మూడు రోజుల కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ శివిర్​ సమావేశాలు ఆదివారం ముగియనున్నాయి. 2024 ఎన్నికలే టార్గెట్‌‌గా  ఆరు ప్రధాన అంశాలపై నేతలు మేధో మథనం చేసినట్లుగా తెలుస్తోంది. ఆరు కమిటీలు రూపొందించిన సిఫార్సుల ముసాయిదాలను ఆదివారం.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అందించనున్నారు కమిటీల చైర్మన్లు. ఉదయం 11 గంటలకు భేటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది.

ఆరు కమిటీలు ఇచ్చిన సిఫారసులు, తీర్మానాలను వర్కింగ్ కమిటీలో ప్రవేశపెట్టనున్నారు సోనియా గాంధీ. రాజకీయ, ఆర్థిక, సామాజిక, వ్యవసాయ, యువత, సంస్థాగత అంశాలపై ప్రవేశపెట్టే తీర్మానాలకు ఆమోదం తెలపనుంది సీడబ్ల్యూసీ. ఆదివారం మధ్యాహ్న 3 గంటలకు చింతన్ శిబిరానికి హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ప్రశాంగించునున్నారు రాహుల్ గాంధీ. అనంతరం నవ సంకల్ప్ శిబిర్ సమావేశాల ముగింపు ఉపన్యాసంలో కీలక ప్రకటన చేయనున్నారు సోనియా.

రాజకీయ వార్తల కోసం

ఇవి కూడా చదవండి: Asaduddin Owaisi: ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు.. ఓటు బ్యాంక్‌పై ఓవైసీ కీలక కామెంట్స్‌..

Chandrababu: జగన్ ఇలాకాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్‌.. ఈనెల 18న కడపలో చంద్రబాబు పర్యటన..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!