మంచి ముహూర్తం కావాలి..!

తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికే హాట్ టాపిక్. నోటిఫికేషన్ రావడంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులు ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నామినేషన్ల మీద నామినేషన్లు వేస్తుంటే.. ప్రధాన పార్టీల అభ్యర్ధులు మాత్రం నామినేషన్ల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి రెడ్డి మాత్రం నామమాత్రంగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నోటిఫికేషన్ విడుదలై నాలుగు రోజులైంది. నామినేషన్ దాఖలుకు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే […]

మంచి ముహూర్తం కావాలి..!
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2019 | 2:09 PM

తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికే హాట్ టాపిక్. నోటిఫికేషన్ రావడంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులు ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నామినేషన్ల మీద నామినేషన్లు వేస్తుంటే.. ప్రధాన పార్టీల అభ్యర్ధులు మాత్రం నామినేషన్ల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి రెడ్డి మాత్రం నామమాత్రంగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

నోటిఫికేషన్ విడుదలై నాలుగు రోజులైంది. నామినేషన్ దాఖలుకు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్ధులు తమ రాశి, నక్షత్రం, పేరు బలాలు చూసుకొని, దాని ప్రకారం నామినేషన్ వేయాలని అనుకుంటున్నారు. మంచి ముహూర్తం కోసం అభ్యర్ధులు పండితులను ఆశ్రయిస్తున్నారు. 30వ తేదీ మంచిగా ఉందని పండితులు చెప్పడంతో ఆరోజే భారీగా నామినేషన్లు వేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే ఓ సెట్ నామినేషన్ దాఖలు చేసిన పద్మావతి రెడ్డి 30న కారక్యకర్తల భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నామినేషన్ సందర్భంగా భారీ జనసమీకరణతో ప్రత్యర్ధికి దడ పుట్టించాలని ప్లాన్ చేస్తున్నారు. నియోజకవర్గంలో మంది, మార్బలం, అంగ, అర్ధబలం కలిగిన నేతలు ఉప ఎన్నికల బరిలో దిగడంతో నామినేషన్ రోజే రాజకీయ సందడి ఓ లెవెల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాజకీయ వేడి రగిలిస్తోంది.