పవన్, రేవంత్..క్రేజీ కాంబో!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఆ పేరు చెబితే ప్రజల్లోకి వైబ్రేషన్స్ అలా వెల్లిపోతాయి.  రేవంత్ రెడ్డి..ఈయన కూడా ఓ రేంజ్ ఉన్న లీడర్. తెలంగాణ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్. వీరిద్దరూ కూడా సమస్క ఏదైనా..ఎదురుగా ఎవరున్నా భీతి లేకుండా ముందుకు దూసుకెళ్తే స్వభావం కలవారు. ఇద్దరికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ ఇద్దరు నేతలు  ఒకే వేదికను పంచుకోవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా […]

పవన్, రేవంత్..క్రేజీ కాంబో!
Pawan kalyan and revanth reddy may fight together against uranium mining in nallamala forest
Follow us

|

Updated on: Sep 16, 2019 | 10:15 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఆ పేరు చెబితే ప్రజల్లోకి వైబ్రేషన్స్ అలా వెల్లిపోతాయి.  రేవంత్ రెడ్డి..ఈయన కూడా ఓ రేంజ్ ఉన్న లీడర్. తెలంగాణ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్. వీరిద్దరూ కూడా సమస్క ఏదైనా..ఎదురుగా ఎవరున్నా భీతి లేకుండా ముందుకు దూసుకెళ్తే స్వభావం కలవారు. ఇద్దరికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ ఇద్దరు నేతలు  ఒకే వేదికను పంచుకోవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఇతర నాయకులు సైతం నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే చాలామంది చూపు మాత్రం రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌పైనే నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న రేవంత్ రెడ్డి నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే పోరాటం మొదలుపెట్టారు. తాజాగా పవన్ కళ్యాణ్ సైతం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టడంతో… ఈ అంశంపై ఇద్దరు కలిసి పోరాటం చేస్తారా అనే అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే..ఈ అంశంపై కలిసి పోరాడామని రేవంత్ రెడ్డికి..పవన్ కళ్యాణ్ పర్సనల్ కాల్ చేసి అడిగారు.

పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి కలిసి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే… అది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రజల్లో రాజకీయంగా తన ఉనికిని చాటుకోవాలని భావిస్తున్న జనసేన సైతం… ఇందుకోసం నల్లమలలో యురేనియం తవ్వకాల అంశంపై పోరాటం చేయడం సరైన మార్గమని భావిస్తోంది. ఈ కారణంగానే ఈ అంశంపై ఆ పార్టీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ అంశంపై పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని భావిస్తే… అందుకు తెలంగాణలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి వంటి నాయకుడి అవసరం కచ్చితంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి సైతం పవన్ కళ్యాణ్‌తో కలిసి పోరాటం చేయడం వల్ల రాజకీయంగా కలిసొస్తుందనే టాక్ ఉంది. మొత్తానికి నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఒకే వేదికపై వచ్చిన రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్… కలిసి పని చేస్తారా లేదా అన్నది  వేచి చూడాలి.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?