రేవంత్ వ్యూహంతో టి.కాంగ్రెస్‌లో కలకలం..ఏంచేశారంటే?

రేవంత్ రెడ్డి.. తెలుగుదేశంపార్టీలో వున్నా.. కాంగ్రెస్ పార్టీకి షిఫ్టు అయినా.. ఆయన రాజకీయాల స్టైలే వేరు. తనదైన దూకుడుతో కేవలం పదేళ్ళ కాలంలోనే రాష్ట్రస్థాయిలో పేరున్న, పట్టున్న నేతగా రేవంత్ రెడ్డి ఎదిగారు. ఒక దశలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చరిష్మా కలిగిన ఏకైక నేతగా మారిన రేవంత్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినా అదే స్థాయిని నిలబెట్టుకున్నారు. 2018 ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారంటేనే కాంగ్రెస్ పార్టీ.. మరీ […]

రేవంత్ వ్యూహంతో టి.కాంగ్రెస్‌లో కలకలం..ఏంచేశారంటే?
Rajesh Sharma

|

Dec 10, 2019 | 6:05 PM

రేవంత్ రెడ్డి.. తెలుగుదేశంపార్టీలో వున్నా.. కాంగ్రెస్ పార్టీకి షిఫ్టు అయినా.. ఆయన రాజకీయాల స్టైలే వేరు. తనదైన దూకుడుతో కేవలం పదేళ్ళ కాలంలోనే రాష్ట్రస్థాయిలో పేరున్న, పట్టున్న నేతగా రేవంత్ రెడ్డి ఎదిగారు. ఒక దశలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చరిష్మా కలిగిన ఏకైక నేతగా మారిన రేవంత్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినా అదే స్థాయిని నిలబెట్టుకున్నారు.

2018 ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారంటేనే కాంగ్రెస్ పార్టీ.. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆయనకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో ఊహించుకోవచ్చు. అయితే.. రేవంత్ రెడ్డి తాను పోటీ చేసిన కొడంగల్‌లో అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. దాంతో ఇక రేవంత్ పని అయిపోయిందని చాలా మంది అనుకున్నారు.

కానీ, ఆ తర్వాత నాలుగైదు నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీ టిక్కెట్ తెచ్చుకున్నారు. తెచ్చుకోవడమే కాకుండా.. తనదైన శైలిలో ప్రచారం చేసి.. విజయం కూడా సాధించారు. ఇక్కడి వరకు బాగానే వున్నా.. ఆ తర్వాతే రేవంత్ రెడ్డి వ్యూహం మారిందంటున్నారు పరిశీలకులు.

ఎంపీగా గెలిచిన తర్వాత టిపిసిసి అధ్యక్ష మార్పు సందర్భంగా తనకు అవకాశం వస్తుందని అనుకున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ వరుస వైఫల్యాలు రేవంత్ రెడ్డికి అనుకూలాంశాలు మారతాయని ఆయన అంఛనా వేశారట. ఉత్తమ్ సారథ్యంలో టి.కాంగ్రెస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోను ఉత్తమ్ తాను పోటీ చేసిన నల్గొండ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు తమ తమ సొంత చరిష్మా తో గెలిచారు. మొత్తమ్మీద తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో కేవలం మూడింటిని గెలుచుకుని, బిజెపి కంటే తక్కువ స్థానాలకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత హుజూర్‌నగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లోను ఉత్తమ్ సతీమణి పద్మావతి ఓటమి పాలయ్యారు.

వరుస ఓటముల నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ సీటుకు ఎసరు రావడం ఖాయమని అందరు అనుకుంటున్నా.. పార్టీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. వెనువెంటనే నిర్ణయం తీసుకునేందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్ ప్రెసిడెంట్ లేరు. సో.. టి.కాంగ్రెస్ అధ్యక్షుని నియామకం మరింత జాప్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

పరిస్థితి ఇలా వుంటే పిసిసి అశావహులు చాలా మంది ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వారందరి కంటే తాను భిన్నమైన వాడినని చాటేందుకు రేవంత్ రెడ్డి తాజాగా వ్యూహం పన్నినట్లు సమాచారం. అందుకే తెలంగాణ కాంగ్రెస్ కేంద్ర స్థానంమైన గాంధీభవన్‌కు ప్యారలల్‌గా తాను ఓ సొంత కార్యాలయాన్ని మల్కాజ్‌గిరి ఏరియాలో రేవంత్ ఏర్పాటు చేసుకున్నారు. తనతో పని వున్న వారంతా ఇక్కడికే రావాలని రేవంత్ కోరుతున్నారు.

సో.. ప్రజా సమస్యల పరిష్కారానికి, ఆందోళనా కార్యక్రమాల రూపకల్పనకు ఈ మల్కాజ్‌గిరి కార్యాలయమే ఇప్పుడు వేదిక కానుంది. వివిధ అంశాలపై తనను కలిసేందుకు వచ్చే వారితో తన కార్యాలయం సందడిగా మారితే.. గాంధీభవన్‌ వైపు ఎవరూ కన్నెత్తి చూడరని, దాంతో తన చరిష్మా ఏంటో అధిష్టానానికి తన ప్రమేయం లేకుండానే తెలిసిపోతుందని రేవంత్ వ్యూహరచన చేసినట్లు చెప్పుకుంటున్నారు. రేవంత్ ఆశలు ఏ మేరకు నెరవేరతాయో వేచి చూడాలి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu