పాకిస్తాన్‌లో కృష్ణమందిరం నిర్మాణం పాపమంటున్న ఛాందసవాదులు

ఇస్లామాబాద్‌లో మూడు వేలకుపైగా హిందువులు ఉన్నారు.. వారి మానాన వారు బతుకున్నారు.. వివాదాలకు దూరంగా ఉంటున్నారు.. ఇన్నాళ్లకు గుడిని పునర్నిర్మించుకుంటామంటే మాత్రం ఫత్వాలు, మత మౌఢ్యం, బెదిరింపులు ముప్పిరిగొన్నాయి

పాకిస్తాన్‌లో కృష్ణమందిరం నిర్మాణం పాపమంటున్న ఛాందసవాదులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 09, 2020 | 2:58 PM

మందిర నిర్మాణం జరిగి తీరుతుందన్న నినాదానికి కౌంటర్‌పార్ట్‌గా మందిరం అక్కడే నిర్మిస్తాం అన్న సొంత నినాదాన్ని పాకిస్తాన్‌ ఎత్తుకుంది.. ఇస్లామాబాద్‌లో శ్రీకృష్ణ మందిరానికి పది కోట్ల రూపాయల డబ్బును కూడా సమకూర్చింది ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం..కానీ కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మందిర నిర్మాణం అంత సులభం కాదేమోననిపిస్తోంది.. పాకిస్తాన్‌లో మతస్వేచ్ఛ ఉత్తి అలంకారమేనని అర్థమవుతోంది.. ఇప్పుడంటే ఇస్లామాబాద్ హైకోర్టు మందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే అక్కడ గుడి కట్టడం కష్టమయ్యేది.. గుడి కట్టడానికి వీల్లేదంటూ కొందరు మత ఛాందసులు కోర్టుకెక్కారు.. కొందరు ఫత్వా జారీ చేశారు.. కొందరు ఇమ్రాన్‌ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.. ఉదారంగా వ్యవహరించిన ఇమ్రాన్‌ఖాన్‌ కూడా వీరి ఒత్తిడికి లోనయ్యారు.. పాకిస్తాన్‌ క్యాపిటల్‌ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా ఆలయ నిర్మాణంపై వెనకడుగు వేసింది.

శంకుస్థాపన జరిగినప్పటి నుంచే ఒత్తిడి….

అసలు కృష్ణమందిరానికి ఎప్పుడైతే శంకుస్థాపన జరిగిందో అప్పటి నుంచి అక్కడ మతపరమైన చర్చలు మొదలయ్యాయి.. నిజానికి ఇదేం కొత్తగా నిర్మిస్తున్న ఆలయమేమీ కాదు.. సయీద్‌పూర్‌లో పాడుబడిన ఆలయాన్నే తిరిగి నిర్మిస్తున్నారంతే.. దీనికే నానా యాగి చేశారు కొందరు.. ఇస్లామిక్‌ తీవ్రవాదులైతే గోడలను కూడా కూల్చేసి ఓ రకంగా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇస్లామాబాద్‌లో ఉన్న హిందువులకు ఆల్‌రెడీ మూడు ఆలయాలు ఉన్నాయని.. వాళ్లకు అవి సరిపోతాయని.. కొత్తగా గుడి కట్టాల్సిన పని లేదని పనిపాటాలేని వాళ్లు వాగారు. శ్రీకృష్ణమందిరం కోసం డబ్బును ప్రభుత్వం వృధా చేస్తోందని కోర్టుకెక్కారు.. ఏమాటకామాట చెప్పుకోవాలి.. ఇస్లామాబాద్‌ హైకోర్టు జస్టిస్‌ అమీర్‌ ఫారూఖ్‌ మాత్రం ఆయం కట్టుకుంటే తప్పేమిటన్నారు.. పాకిస్తన్‌ రాజ్యాంగం ప్రకారం మైనారిటీ ప్రజలకు వారి మతాచారాలను పాటించుకునే స్వేచ్ఛ ఉందన్నారు.. దాన్ని ఎవరూ అడ్డుకోలేరని కూడా చెప్పారు.. ఇస్లామాబాద్‌లో మూడు వేలకుపైగా హిందువులు ఉన్నారు.. వారి మానాన వారు బతుకున్నారు.. వివాదాలకు దూరంగా ఉంటున్నారు.. ఇన్నాళ్లకు గుడిని పునర్నిర్మించుకుంటామంటే మాత్రం ఫత్వాలు, మత మౌఢ్యం, బెదిరింపులు అన్నీ ముప్పిరిగొన్నాయి.. ఆల్‌రెడీ హిందువులకు రామమందిరం ఉందంటున్నారు కానీ.. ఇప్పుడది పర్యాటక కేంద్రంగానే ఉంది తప్ప హిందువులు పూజలు చేసుకోవడానికి కాదు.. పూజలు పునస్కారాలకు ప్రభుత్వం అనుమతిస్తేగా చేసుకోవడానికి…

శ్రీకృష్ణమందిర నిర్మాణానికి ఇమ్రాన్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే కాకుండా పది కోట్లు కేటాయించేసరికి ఇస్లామిక్‌ పెద్దలు, విపక్షాల నేతలు గొడవ చేయడం మొదలు పెట్టారు. పంజాబ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చౌదరీ పర్వేజ్‌ ఇలాహీ అయితే ఆలయ నిర్మాణం ఇస్లామ్‌ మత సిద్ధాంతాలకు వ్యతిరేకమని గొంతు చించుకున్నాడు. జామియా అష్రాఫియా మదర్సా అయితే షరియా లా ప్రకారం పాడుపడిన మందిరాలను పునర్నించుకునే హక్కు లేదంటూ ఫత్వా జారీ చేసింది. ఇంతటి పాపానికి ఒడిగట్టవద్దని పాక్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తాము ప్రభుత్వానికి కట్టే పన్నులను ఇలా వృథా చేయవద్దంటూ శోకాలు పెట్టారు కొందరు. అక్కడున్న హిందువులు కూడా పాకిస్తాన్‌ పౌరులేనని, వారు కూడా పన్నులు కడతారని తెలిసీ తెలియనట్టు నటించారు. ఇదే పాకిస్తాన్‌ ప్రభుత్వం కర్తార్‌పూర్‌ కారిడార్‌ కోసం కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.. ఓ చిన్నపాటి గుడి కట్టుకుంటామంటే మాత్రం ఎక్కడలేని ఇస్లామిక్‌ చట్టాలు గుర్తుకొస్తున్నాయి..

ఇస్లామాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అక్కడి హిందువులకు కాసింత ఊరట కలిగిందేమో కానీ … పక్షం రోజులుగా అక్కడ జరిగిన ఆందోళనలు, నిరసనలు వారిలో కచ్చితంగా అభద్రతాభావాన్ని కలిగించి ఉండవచ్చు. ఆలయ ప్రహారిని కూల్చివేసిన దృశ్యాలు.. అక్కడ నమాజ్‌ చేస్తున్న చిత్రాలు సహజంగానే కడుపురగిలించి ఉండవచ్చు.. ఇవన్నీ ఓ రకంగా పాకిస్తాన్‌లోని మైనారిటీలను హెచ్చరించడమే! మైనారిటీలకు సమాన స్వేచ్ఛా స్వతంత్రాలు ఉంటాయని చెబుతున్న పాకిస్తాన్‌.. ఓ చిన్న పాటి గుడి నిర్మాణానికి ఇంతలా ఎందుకు ఉలిక్కిపడుతున్నది…? అక్కడి మైనారిటీల దుర్భర జీవనచిత్రానికి ఇది అద్దం పట్టడం లేదా?

మొదట్నుంచి  మైనారిటీలంటే చిన్నచూపే..!

పాకిస్తాన్‌లో మైనారిటీలను చిన్నచూపు చూడటమనేది నిన్నోమోన్నో మొదలు కాలేదు.. పాకిస్తాన్‌ ఏర్పడినప్పటి నుంచి ఆ దుర్నీతి ఆ దేశానికి ఉంది. మైనారిటీల సంఖ్య క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నది అందుకే! కొందరిని బలవంతంగా మతం మార్పించారు.. అనివార్యంగా మతం మార్చుకునే పరిస్థితులను కొందరికి కల్పించారు. కొందరు కట్టుబట్టలతో వేరే దేశాలకు వలస వెళ్లిపోయారు. పాకిస్తాన్‌ పాఠ్య పుస్తకాలలో కూడా ఆలయాలను ధ్వంసం చేసిన మహ్మద్‌ ఘజనీలాంటి వాళ్లను వీరులుగా చిత్రీకరిస్తూ పాఠ్యాంశాలు ఉంటాయే తప్ప మంచి మాటలు చెప్పిన మహనీయుల గురించి పల్లెత్తు మాట కూడా ఉండదు.

నయా పాకిస్తాన్‌ అంటే అర్థం ఇది కాదేమో!

మైనారిటీ పౌరులతో పాకిస్తాన్‌ ఎలా వ్యవహరిస్తున్నది? పాకిస్తాన్‌లో ఉంటున్న హిందువులు, క్రిస్టియన్లు, సిఖ్కులకు ఇతరులతో సామాజిక సంబంధాలు ఉన్నాయా? తృతీయశ్రేణి పౌరులుగా అక్కడ ఎందుకు బతకాల్సి వస్తోంది? పాక్‌ రాజ్యాంగం కల్పించిన సమానహక్కులకు అర్థం పర్థం లేవా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి కలుగుతున్నాయి. పాకిస్తాన్‌ రాజకీయ నాయకులు మైనారిటీలపై మొసలి కన్నీరు కారుస్తుంటారు.. మైనారిటీల కోసం పాటుపడాలనే చిత్తశుద్ధి కొందరిలో ఉన్నా వారు కూడా మతమౌఢ్యుల బెదిరింపులతో వెనక్కి తగ్గుతున్నారు. నవాజ్‌షరీఫ్‌, బిలావల్‌ భుట్టో చివరకు ఇమ్రాన్‌ఖాన్‌ కూడా చాలా పెద్దపెద్ద మాటలు మాట్లాడారు.. కేవలం మాటల వరకే పరిమితమయ్యారు.. 2017లో కరాచీలో జరిగిన హోలీ సంబరాలలో నవాజ్‌ షరీఫ్‌ పాల్గొన్నందుకు ఛాందసవాదులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కేవలం హిందువులు, క్రిస్టియన్లు, సిఖ్కుల మీదే కాదు అహ్మదీయుల మీద కూడా అక్కడ దారుణాలు జరుగుతున్నాయి.. ఉన్నత పదవులు అధిరోహించడానికి వీరికి హక్కే లేదు.. హక్కున్నా అది జరగని పని! నయా పాకిస్తాన్‌ అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్న ఇమ్రాన్‌ఖాన్‌… ఆ కొత్త పాకిస్తాన్‌లోని సరికొత్త మార్పును మైనారిటీల సంక్షేమం నుంచి మొదలుపెడితే బాగుంటుంది..

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా