కేటీఆర్ సీఎం అవగానే.. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ఖాయం.. సంచలన కామెంట్స్‌ చేసిన డిప్యూటీ స్పీకర్‌

ఇప్పటికే కాబోయే సీఎం అంటూ బహిరంగ వేదికపైనే కేటీఆర్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన పద్మారావు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి..

  • K Sammaiah
  • Publish Date - 6:13 pm, Fri, 22 January 21
కేటీఆర్ సీఎం అవగానే.. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ఖాయం.. సంచలన కామెంట్స్‌ చేసిన డిప్యూటీ స్పీకర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఖాయం అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం హోరెత్తుతుంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి అంటూ మద్దతు పలుకుతూ వస్తున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ ఒకడుగు ముందుకేసి నేరుగా కేటీఆర్‌కే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నేపథ్యంలో రాజకీయవర్గాల్లో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కేసీఆర్ వారసుడిగా.. తెలంగాణ సీఎంగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టే ముహూర్తం ఖరారయ్యిందా..? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేబినెట్‌ను ప్రక్షాళన చేయబోతున్నారా..? అనే అంశాలపై ఎవరికి వారే విశ్లేషించుకుంటున్నారు.

అయితే ఈ ఊహాగానాలకు మరింత వేడెక్కించే విషయాలను బయటపెట్టారు.. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు. ఇప్పటికే కాబోయే సీఎం అంటూ బహిరంగ వేదికపైనే కేటీఆర్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన పద్మారావు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. త్వరలోనే పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ ప్రకటించారు. కేటీఆర్ సీఎం అవగానే.. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందంటూ సంచలన ప్రకటన చేశారు.