PoKలో మిన్నంటిన ఆగ్రహజ్వాలలు.. నిరసనకారులపై పాక్ సైన్యం పైశాచికత్వం.. పెల్లెట్ గన్లు, కాల్పులు!

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. మంగళవారం (జూన్ 09) మధ్యాహ్నం నుండి ప్రారంభమైన బంద్, నిరసనల పిలుపుతో పీఓకే వ్యాప్తంగా తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రావల్‌కోట్, ముజఫరాబాద్, కోట్లి, భింబర్, దద్యాల్, పాలాండ్రి, సుధనోటి సహా పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో వేలాది మంది స్థానిక ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వానికి, పాక్ సైన్యానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. పాక్ చెర నుంచి విముక్తి కావాలంటూ స్వాతంత్ర్యం కోసం నినాదాలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తంగా మారిపోయింది.

PoKలో మిన్నంటిన ఆగ్రహజ్వాలలు.. నిరసనకారులపై పాక్ సైన్యం పైశాచికత్వం.. పెల్లెట్ గన్లు, కాల్పులు!
Pok Turns Battlefield

Updated on: Jun 09, 2026 | 4:05 PM

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. మంగళవారం (జూన్ 09) మధ్యాహ్నం నుండి ప్రారంభమైన బంద్, నిరసనల పిలుపుతో పీఓకే వ్యాప్తంగా తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రావల్‌కోట్, ముజఫరాబాద్, కోట్లి, భింబర్, దద్యాల్, పాలాండ్రి, సుధనోటి సహా పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో వేలాది మంది స్థానిక ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వానికి, పాక్ సైన్యానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. పాక్ చెర నుంచి విముక్తి కావాలంటూ స్వాతంత్ర్యం కోసం నినాదాలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తంగా మారిపోయింది.

నిరసనకారులపై సైన్యం పైశాచికత్వం!

రావల్కోట్‌లో ఉదయం నుండి ప్రజలు ప్రధాన రహదారులన్నింటినీ దిగ్బంధించారు. భింబర్ నుండి రావల్కోట్ వైపు నిరసనకారులు దూసుకురాకుండా అడ్డుకునేందుకు పాకిస్తానీ పోలీసులు, సైన్యం, రేంజర్లు కర్కశంగా వ్యవహరించారు. నిరసనకారులపై నేరుగా కాల్పులు జరపడంతో పాటు బాష్పవాయువు (టియర్ గ్యాస్) ప్రయోగించారు. అత్యంత ప్రమాదకరమైన పెల్లెట్ గన్‌లను కూడా వాడటంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాలాండ్రి, సుధనోటి వంటి ప్రాంతాల్లో ప్రజలు చేతుల్లో కర్రలు పట్టుకుని పాక్ బలగాలను ఎదుర్కొన్నారు. నిరసనల దెబ్బకు పీఓకే వ్యాప్తంగా మార్కెట్లు, వ్యాపార సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి.

పిండి, బియ్యం, పప్పుధాన్యాల కోసం పోరాటం..

పీఓకే ప్రజలు ప్రధానంగా 38 డిమాండ్ల సాధన కోసం ఈ సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ముజఫరాబాద్‌లోని నీలం వంతెన వద్ద భద్రతా దళాలకు, పౌరులకు మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. పాకిస్తాన్‌లో భాగం కాని పీఓకే ప్రాంతంలో మంగ్లా డ్యామ్ వంటి ప్రతిష్టాత్మక జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించి, తమ నుంచి విద్యుత్‌ను దొంగిలిస్తున్నారని.. తమకు చౌకగా విద్యుత్ అందించాలని, అలాగే పిండి, బియ్యం, పప్పుధాన్యాలను సబ్సిడీ ధరలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఉగ్రవాదులను ఎంపీలుగా మారుస్తున్న పాక్ సైన్యం

పీఓకే పార్లమెంటులో ఉన్న 12 శరణార్థుల సీట్లను తక్షణమే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ 12 సీట్లు భారత కాశ్మీర్ నుండి వలస వెళ్లి, ప్రస్తుతం పాకిస్తాన్‌లోని వివిధ నగరాల్లో నివసిస్తున్న వారి కోసం కేటాయించారు. అయితే, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ (ISI) కలిసి ఇస్లామాబాద్, కరాచీలలో తలదాచుకుంటున్న ‘హిజ్బుల్ ముజాహిదీన్’ ఉగ్రవాదులను, వారి కుటుంబ సభ్యులను ఈ 12 సీట్లకు దొడ్డిదారిన ఎన్నుకుంటున్నాయి. దీనివల్ల పీఓకే పార్లమెంటులోని మొత్తం 45 సీట్లలో 12 సీట్లు నేరుగా పాక్ ఆర్మీ చేతుల్లోకి వెళ్తున్నాయి. వీటి సాయంతో స్థానిక పీఓకే ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పాక్ సైన్యం తనకిష్టమైన వ్యక్తినే అక్కడి ప్రధానమంత్రిగా కూర్చోబెడుతోంది.

‘లాహోర్ కసాయి’ రాకతో సామూహిక హత్యాకాండ!

పీఓకేలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లకు వ్యతిరేకంగా తిరుగుబాటు రావడానికి ప్రధాన కారణం ఆర్మీ అరాచకాలే. గత ఏడాది పాక్ సైన్యం పీఓకే ఐఎస్ఐ సెక్టార్ కమాండర్‌గా బ్రిగేడియర్ ఫైక్ అయూబ్‌ను నియమించింది. గతంలో పంజాబ్ (పాకిస్తాన్)లో ఉంటూ లాహోర్‌లో సామూహిక హత్యాకాండకు పాల్పడి “లాహోర్ కసాయి”గా ముద్రపడిన ఈ అధికారిని.. అసిమ్ మునీర్ ప్రత్యేకంగా పీఓకే ప్రజల అణచివేత కోసం ఇక్కడికి పంపారు. ఈ కిరాతక అధికారి వచ్చిన గత 8 నెలల కాలంలోనే, జూన్ 9వ తేదీ మధ్యాహ్నం నాటికి సొంత హక్కుల కోసం పోరాడుతున్న 57 మంది అమాయక పీఓకే పౌరులను పాక్ సైన్యం తూటాలతో కాల్చి చంపడం గమనార్హం. మరోవైపు, పీవోకేలో జరుగుతున్న అరాచకాలపై ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us