ఏపీ ఎన్నికల విశేషాలు

ఏపీ ఎన్నికల విశేషాలు

తొలి దశ సార్వత్రిక ఎన్నికలకు ఏపీలోని 175 శాసనసభ స్థానాలకు 3,279 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలకు 370 నామినేషన్లు దాఖలు కాగా తరువాత‌ కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు 350, కర్నూలు జిల్లాలోని 14 స్థానాలకు 344, తూర్పుగోదావరిలోని 19 స్థానాలకు 319, అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 288, చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు 287, విశాఖపట్నం జిల్లాలోని 15 స్థానాలకు 245, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 27, 2019 | 4:46 PM

తొలి దశ సార్వత్రిక ఎన్నికలకు ఏపీలోని 175 శాసనసభ స్థానాలకు 3,279 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలకు 370 నామినేషన్లు దాఖలు కాగా తరువాత‌ కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు 350, కర్నూలు జిల్లాలోని 14 స్థానాలకు 344, తూర్పుగోదావరిలోని 19 స్థానాలకు 319, అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 288, చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు 287, విశాఖపట్నం జిల్లాలోని 15 స్థానాలకు 245, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు 244, ప్రకాశం జిల్లాలో 10 స్థానాలకు 236, కడప జిల్లాలో 10 స్థానాలకు 217, శ్రీకాకుళం జిల్లాలోని 10 స్థానాలకు 146, నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు 129, విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు 111 నామినేషన్లు వేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.

నియోజకవర్గం వారిగా చూసుకుంటే నంద్యాల అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 42 మంది నామినేషన్‌ వేశారు. దీని తర్వాత స్థానంలో కడప జిల్లా జమ్మలమడుగులో 39, మంగళగిరిలో 37, పులివెందులలో 23 మంది చొప్పున నామినేషన్‌ వేశారు.

ఇక ఏపీలోని 25 పార్లమెంటు స్థానాలకు గాను 472 మంది నామినేషన్‌ వేశారు. అత్యధికంగా నంద్యాల పార్లమెంటుకు 36, తరువాత‌ స్థానంలో గుంటూరు 25, విశాఖపట్నం 24, కడప 24, కర్నూలు 23, అనంతపురం 23, మచిలీపట్నం 22, నర్సాపురం 20, విజయవాడ 19, నరసరావుపేటలో 19 నామినేషన్లు వచ్చినట్టు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 28.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu