ఆ సాధ్విని బహిష్కరించాలి…

బీహార్‌లో బీజేపీకి భాగస్వామ్య పార్టీగా జేడీయూ ఉన్నప్పటికీ… గాడ్సేను దేశభక్తుడంటూ అభివర్ణించిన బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ను బీజేపీ నుంచి తొలగించాలని జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాట్నాలో ఆదివారంనాడు ఓటు హక్కు వినియోగించుకున్న నితీష్‌ను ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించింది. దీనిపై నితీష్ స్పందిస్తూ, ఆమె (ప్రగ్యా సింగ్) వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని, అలాంటి వ్యాఖ్యలకు తమ సపోర్ట్ ఉండదని అన్నారు. అయితే […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:08 pm, Sun, 19 May 19
ఆ సాధ్విని బహిష్కరించాలి...

బీహార్‌లో బీజేపీకి భాగస్వామ్య పార్టీగా జేడీయూ ఉన్నప్పటికీ… గాడ్సేను దేశభక్తుడంటూ అభివర్ణించిన బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ను బీజేపీ నుంచి తొలగించాలని జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాట్నాలో ఆదివారంనాడు ఓటు హక్కు వినియోగించుకున్న నితీష్‌ను ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించింది. దీనిపై నితీష్ స్పందిస్తూ, ఆమె (ప్రగ్యా సింగ్) వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని, అలాంటి వ్యాఖ్యలకు తమ సపోర్ట్ ఉండదని అన్నారు. అయితే అది పూర్తిగా బీజేపీ అంతర్గత వ్యవహారమని, సాధ్విపై బీజేపీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నితీష్ స్పష్టం చేశారు.