నెల రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాలి.. సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ

నెల రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ డిమాండ్ చేశారు. సిఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి...

నెల రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాలి.. సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ
Follow us

|

Updated on: Jun 28, 2021 | 5:06 PM

నెల రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ డిమాండ్ చేశారు. సిఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి మరో పోరాటమని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఉత్తుత్తి ఉద్యోగాల డూపు క్యాలెండ‌ర్‌తో ప్రభుత్వం నిరుద్యోగుల్ని నిలువునా ముంచిందని ఎద్దేవా చేశారు. మోసపూరిత జాబ్ క్యాలెండ‌ర్ ఉప‌సంహ‌రించుకోవాలని సూచించారు. 2 ల‌క్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల‌కు రీ నోటిఫికేష‌న్ ఇవ్వాలని  లోకేష్ డిమాండ్ చేశారు.

అధికారంలోకొచ్చి రెండేళ్ల‌యినా జ‌న‌వ‌రి1న మాట త‌ప్పార‌ని, జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయ‌లేద‌న్నారు.  ప్రభుత్వంలో ఉన్న ఖాళీలలో 0.47% మాత్రమే పోస్టులతో ప్ర‌క‌టించిన బోగ‌స్ జాబ్ క్యాలెండ‌ర్ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. వేల పోస్టులు ఖాళీలుంటే గ్రూప్‌1, 2 లో కేవలం 36 పోస్టులు మాత్రమే జాబ్ క్యాలెండ‌ర్‌లో పెట్ట‌డం నిరుద్యోగుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్ల‌డ‌మేన‌న్నారు. కానిస్టేబుళ్లు, స‌బ్‌ ఇన్స్పెక్టర్ల పోస్టులు 16000 కంటే ఎక్కువ ఖాళీలుంటే జాబ్‌ క్యాలెండర్ అటువంటి 450 పోస్టుల‌ను ప్ర‌క‌టించి ల‌క్ష‌లాది మంది ఆశావ‌హులకు స‌ర్కారు తీవ్ర నిరాశ మిగిల్చింద‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Maoists Dump: మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీగా నగదు స్వాధీనం.. మావోయిస్టులకు చెందినదిగా అనుమానిస్తున్న పోలీసులు

Rave Party Case: రేవ్ పార్టీలో పట్టుబడిన బిగ్‌బాస్ మాజీ పోటీదారు.. భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం