జగన్‌పై నిప్పులు చెరిగిన లోకేశ్

జగన్‌పై నిప్పులు చెరిగిన లోకేశ్

విజయవాడ: వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై మంత్రి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. శవాలపై పేలాలు ఏరుకునే 420 జగన్ మోహన్ రెడ్డి అంటూ ఘాటుగా స్పందించారు. జగన్ మరోసారి శవరాజకీయాలు మొదలుపెట్టారని, తండ్రి శవాన్ని అండ్డం పెట్టుకుని సీఎం పీఠం ఎక్కాలనుకుని చావు దెబ్బతిన్నా ఆయనకు బుద్ధి రాలేదంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు మరోసారి దొంగ పత్రిక, దొంగ రాతలతో శవాన్ని అడ్డుపెట్టుకొని కుల రాజకీయం చెయ్యాలని ‘420’ ఆరాటపడుతున్నారని, కొండవీడులో రైతు కోటయ్య వ్యక్తిగత కారణాలతో చనిపోతే […]

Vijay K

| Edited By:

Oct 18, 2020 | 7:26 PM

విజయవాడ: వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై మంత్రి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. శవాలపై పేలాలు ఏరుకునే 420 జగన్ మోహన్ రెడ్డి అంటూ ఘాటుగా స్పందించారు. జగన్ మరోసారి శవరాజకీయాలు మొదలుపెట్టారని, తండ్రి శవాన్ని అండ్డం పెట్టుకుని సీఎం పీఠం ఎక్కాలనుకుని చావు దెబ్బతిన్నా ఆయనకు బుద్ధి రాలేదంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు మరోసారి దొంగ పత్రిక, దొంగ రాతలతో శవాన్ని అడ్డుపెట్టుకొని కుల రాజకీయం చెయ్యాలని ‘420’ ఆరాటపడుతున్నారని, కొండవీడులో రైతు కోటయ్య వ్యక్తిగత కారణాలతో చనిపోతే సానుభూతి ప్రకటించాల్సింది పోయి, నీచ రాజకీయం కోసం వాడుకోవడమే వైసీపీ ఎజెండానా? అని ప్రశ్నించారు.

గుంటూరు జిల్లా కొండవీడులో నిన్న సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా రైతు పిట్టల కోటేశ్వరరావు (కోటయ్య) చనిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు హెలికాప్టర్‌ దిగేందుకు వీలుగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ సమీపంలో ఆ గ్రామానికి చెందిన కోటయ్యకు చెందిన తోటలను నాశనం చేశారని, పోలీసులు కొట్టడం వల్లే ఆయన చనిపోయారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. దీనికి స్పందనగా మంత్రి నారా లోకేశ్ వరుస ట్వీట్లతో జగన్‌పై నిప్పులు చెరిగారు.

రైతు పొలానికి, ముఖ్యమంత్రి హెలిప్యాడ్ కి సంబంధమే లేదన్న విషయం జగన్ దొంగ పత్రికకు తెలియదా? వైసీపీ శవ రాజకీయాల పార్టీ అని మరోసారి రుజువైందని, శవ, కుల రాజకీయాలకు త్వరలోనే ప్రజలు సమాధానం చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు. ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించిన రైతును కాపాడటానికి పోలీసులు ఎంత శ్రమించారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని ఓ వీడియోను లోకేశ్ పోస్ట్ చేశారు. ఇంత కష్టపడితే జగన్ రెడ్డి రాజకీయ స్వార్థం కోసం పోలీసులపై నిందలు వేయడం అతని శవ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu