చంద్రబాబుకు వల్లభనేని వంశీ కౌంటర్‌… గతంలో ఖర్జూర నాయుడు రాజ్యాంగం అమలైందా అంటూ ఎద్దేవా

జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు వంశీ. ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉంటే... గతంలో ఖర్జూర నాయుడు రాజ్యాంగం..

  • K Sammaiah
  • Publish Date - 4:08 pm, Fri, 22 January 21
చంద్రబాబుకు వల్లభనేని వంశీ కౌంటర్‌... గతంలో ఖర్జూర నాయుడు రాజ్యాంగం అమలైందా అంటూ ఎద్దేవా

టీడీపీ అధినేత చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. నిన్న జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు వంశీ. ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉంటే… గతంలో ఖర్జూర నాయుడు రాజ్యాంగం అమలైందా అని ఎద్దేవా చేశారు. ఏ రాజ్యాంగం ప్రకారం… కరకట్టపై అక్రమ కట్టడం కట్టారని చంద్రబాబును వంశీ ప్రశ్నించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పంచాయతీ ఎన్నిక‌లు నిర్వహించాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్పందిస్తూ సీఎం జగ‌న్ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. న్యాయ‌మూర్తులు మారినంత మాత్రాన న్యాయం మార‌ద‌ని వ్యాఖ్యానించారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాలంటే కుదరదని చంద్రబాబు కామెంట్ చేశారు.

అస‌లు రాష్ట్రంలో ఎన్నిక‌ల సంఘ‌మే వ‌ద్ద‌నే రీతిలో సీఎం వ్య‌వ‌హ‌రించార‌ని ఎద్దేవా చేశారు. పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను కూడా వ‌ద్దంటారేమోన‌ని చంద్రబాబు చురకలించారు. జ‌గ‌న్ కు రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌పైనే న‌మ్మ‌కం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

చంద్రబాబు కామెంట్స్‌కు వంశీ అదేస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు.
బీజేపీ బలపడుతుందన్న భయంతోనే చంద్రబాబు హిందూత్వ అజెండాను ఎత్తుకున్నారని విమర్శించారు. చంద్రబాబుకు హిందూ దేవుళ్లపై ఉన్నది కేవలం ఓట్ల ప్రేమే అని ఎద్దేవా చేశారు.