MLA Jeevan Reddy: రేవంత్ ఓ హోల్ సేల్ బ్లాక్ మెయిలర్.. విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డిపై పీయూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. చీకటి పనులకు రేవంత్ రెడ్డి నెంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ విమర్శించారు.

MLA Jeevan Reddy: రేవంత్ ఓ హోల్ సేల్ బ్లాక్ మెయిలర్.. విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
Jeevan Reddy
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 14, 2021 | 3:45 PM

పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డిపై పీయూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. చీకటి పనులకు రేవంత్ రెడ్డి నెంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ విమర్శించారు. రేవంత్ హోల్ సేల్ బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవ చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు అంబాసిడర్ అయితే.. అభివృద్ధికి కేటీఆర్ అనే సంగతి మరిపోవద్దన్నారు. డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ అనేది రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని.. ముందుగా ఊడ్త పంజాబ్ సినిమా చూసి రేవంత్ మాట్లాడాలని అన్నారు. TRS నాయకులు డేటాతో మాట్లాడితే.. రేవంత్ రెడ్డి నోటి తీటతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రేస్ పాలనలో హైదరాబాద్ అంతా రౌడీ షీటర్లతో నిండి ఉండేదని.. ఇపుడు సింగపూర్- బ్యాంకాక్ తరహాలో క్రైమ్ కంట్రోల్ సిటీగా తెలంగాణ పోలీస్ మార్చేసిందని అన్నారు. రేవంత్ రెడ్డి పోలీసులను సైతం బ్లాక్ మెయిల్ చేస్తుండని అన్నారు. కరోనా సమయంలో సొంత నియోజకవర్గమైన కొడంగల్- మల్కాజిగిరి ఎప్పుడు వెళ్లావా అంటూ ప్రశ్నించారు. రేవంత్ ఓ ఐరన్ లెగ్ అంటూ.. తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే- కాంగ్రేస్‌కు పడుతుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి గాడ్ ఫాథర్ చంద్రబాబే కేసీఆర్‌ను ఏం చేయలేక చేయలేకపోయాడని… లిల్లిపుట్ రేవంత్‌తో ఏం చేస్తాడని ఎద్దేవ చేశారు.

ఇవి కూడా చదవండి: Viral Video: కుక్కను కాపాడేందుకు పిల్లి చేసిన పోరాటం చూస్తే ఆశ్చర్యపోతారు.. నిజమైన స్నేహం ఇదేనంటూ నెటిజన్ల కామెంట్లు

Maggi Milkshake: వారెవ్వా.. మ్యాగీని ఇలా కూడా చేస్తారా.. నెట్టింట్లో వైరలవుతున్న నయా వంటకం..

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్