Harish Rao: వాళ్లు చెప్పేవన్నీ అబద్దాలే.. కిషన్‌ రెడ్డి, బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి హరీష్ స్ట్రాంగ్ కౌంటర్..

మోటార్లకు మీటర్లు, చేనేతపై జీఎస్టీ అంశంలో బీజేపీ ఆరోపణలకు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. మోటార్లకు మీటర్లపై కేంద్రం రాసిన లేఖలను చదివి వినిపించారు.

Harish Rao: వాళ్లు చెప్పేవన్నీ అబద్దాలే.. కిషన్‌ రెడ్డి, బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి హరీష్ స్ట్రాంగ్ కౌంటర్..
Harish Rao
Follow us

|

Updated on: Oct 31, 2022 | 2:58 PM

మోటార్లకు మీటర్లు, చేనేతపై జీఎస్టీ అంశంలో బీజేపీ ఆరోపణలకు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. మోటార్లకు మీటర్లపై కేంద్రం రాసిన లేఖలను చదివి వినిపించారు. జీఎస్టీ కౌన్సిల్‌లో చేనేతపై ఐదు శాతం పన్ను వేయొద్దని 2017లోనే రాష్ట్రం తేల్చి చెప్పిందన్నారు. ఆనాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారని, కావాలంటే ఆయన్ను అడగాలని హరీష్‌ రావు సూచించారు. కేంద్రమంత్రి పదవిలో ఉన్న కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ ఇలాంటి చిల్లర రాజకీయం చేయడం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు. కిషన్‌ రెడ్డి, బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమవారం హరీశ్‌ రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ కామెంట్స్ అనంతరం.. కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఆయనపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు హరీష్‌ రావు సోమవారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చేనేతపై జీఎస్టీ వేయొద్దని 2017లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టంగా చెప్పిందని హరీష్‌ తెలిపారు.

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ దేనని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన కేసీఆర్‌ సభతో బీజేపీ నాయకులకు కంటిమీద కునుకులేకుండా పోయిందని.. దీంతో నకిలీ మాటలు, వెకిలి చేష్టలతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారు నోటికొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడుతున్నారని.. ఇలా గల్లీ నేతలు కూడా మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 8 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మునుగోడు వస్తే తాము చూపిస్తామని హరీశ్‌ అన్నారు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్ల ద్వారా ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందని హరీశ్ తెలిపారు. రూ.100కోట్ల ఆశ చూపినా తమ ఎమ్మెల్యేలు వాటిని గడ్డి పోచలా చూశారంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

గతంలో టీఆర్ఎస్.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే అంశంపై కిషన్‌రెడ్డి చేసిన విమర్శలపై కూడా హరీశ్ స్పందించారు. రాజ్యాంగంలో విలీనానికి ఓ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకున్నారని.. అలాంటప్పుడు తమ పార్టీలో విలీనమైతే తప్పుగా ఎలా చూపిస్తారంటూ నిలదీశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ఎన్నో ప్రభుత్వాలను బీజేపీ నేతలు కూలగొట్టి దొడ్డిదారిన గద్దెనెక్కారని మండిపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..