MAMATA SHOCKS SONIA: సోనియాకు మమత షాక్.. విపక్ష కూటమి సారథ్యం కోసం పోటాపోటీ.. లేఖలతో రంగంలోకి దీదీ

మమతా బెనర్జీ అనూహ్యంగా రంగ ప్రవేశం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో విపక్షాలను ఏకం చేయడం ద్వారా ఉమ్మడి అభ్యర్థిని నిలిపే ప్రక్రియలో విపక్ష కూటమికి సారథ్యం వహించేందుకు ఓ వైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సిద్దమవుతున్న తరుణంలో...

MAMATA SHOCKS SONIA: సోనియాకు మమత షాక్.. విపక్ష కూటమి సారథ్యం కోసం పోటాపోటీ.. లేఖలతో రంగంలోకి దీదీ
Mamata Banerjee-sonia gandhi- kcr
Follow us

|

Updated on: Jun 11, 2022 | 6:51 PM

MAMATA BANERJEE SHOCKS SONIA GANDHI WRITES CMS AND PARTIES: మమతా బెనర్జీ అనూహ్యంగా రంగ ప్రవేశం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో విపక్షాలను ఏకం చేయడం ద్వారా ఉమ్మడి అభ్యర్థిని నిలిపే ప్రక్రియలో విపక్ష కూటమికి సారథ్యం వహించేందుకు ఓ వైపు కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీ(sonia gandhi) సిద్దమవుతున్న తరుణంలో మమతా బెనర్జీ ఉన్నట్లుండి రంగంలోకి దిగారు. విపక్షాలను మరీ ముఖ్యంగా బీజేపీ(BJP)ని గట్టిగా వ్యతిరేకించే శక్తులను ఏకం చేసే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులకు, బీజేపీయేతర పార్టీల అధినేతలకు కలిపి మొత్తం 22 లేఖలను దీదీ జూన్ 11వ తేదీన పంపించారు. జూన్ 15వ తేదీన ఏ రోజైతే రాష్ట్రపతి ఎన్నికల(2022 Indian presidential election) నోటిఫికేషన్ జారీ కానున్నదో సరిగ్గా అదే రోజు న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు భేటీ అవుదాం.. రండి అంటూ మమతా బెనర్జీ తన లేఖల్లో వివిధ పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను కోరారు. తద్వారా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే దిశగా అడుగులు ప్రారంభించారు. రాష్ట్రపతి ఎన్నికల వేళ ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలని మమత పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య స్వభావం కలిగిన దేశానికి సమర్థవంతమైన ప్రతిపక్షం అవసరమని, దేశంలోని ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై దేశాన్ని పీడిస్తున్న విభజన శక్తులను ప్రతిఘటించాలని దీదీ లేఖల్లో పేర్కొన్నారు. బీజేపీ (BJP) చర్యలను వ్యతిరేకిస్తున్న విపక్ష నేతలను వివిధ కేంద్ర సంస్థలచే లక్ష్యంగా చేసుకుంటున్నారని, విపక్ష పార్టీల ప్రతిఘటన బలోపేతం కావాల్సిన తరుణం ఆసన్నమైందని ఆమె వివరించారు. విభజన శక్తుల కారణంగా దేశం అంతర్జాతీయ స్థాయిలో ఈసడింపులకు గురి అవుతోందని, దేశానికి కొత్త భవిష్యత్తునిచ్చేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన తరుణమిదేనని అన్నారు. అందుకే అందరం సమావేశమై ఈ రాష్ట్రపతి ఎన్నికల వేళ.. రాజకీయ పునరేకీరణపై నిర్ణయం తీసుకోవాల్సి వుందని దీదీ లేఖల్లో పేర్కొన్నారు.

విపక్షాలను ఏకం చేయాలన్న సంకల్పంలోను విపక్ష పార్టీల్లో ఎవరి ఆధిపత్యం కోసం వారు ప్రయత్నిస్తున్నట్లు దీదీ లేఖ ద్వారా తేటతెల్లమైంది. నిజానికి జూన్ 9వ తేదీన రాష్ట్రపతి (PRESIDENT OF INDIA) ఎన్నికల షెడ్యూలుపై ప్రకటన వెలువడిన వెంటనే అటు ఎన్డీయే అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరమైంది. ఇటు విపక్ష పార్టీలను ఏకతాటిపై తేవడం ద్వారా రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి కేక్ వాక్ ఇవ్వకూడదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా నిర్ణయించారు. యుపీఏ (UPA) పక్షాలతోపాటు బీజేపీని వ్యతిరేకిస్తూనే కాంగ్రెస్ పార్టీకి దూరం పాటిస్తున్న పార్టీలతో సంప్రదింపులు జరిపే బాధ్యతను పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే (MALLIKARJUNA KHARGE)కు అప్పగించారు. ఆయన మున్ముందుగా బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో సంప్రదింపులు ప్రారంభించ తలపెట్టారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాడే ఖర్గే ముంబయిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ని కలిశారు. జూన్ 10న సోనియా స్వయంగా ఎంకే స్టాలిన్ తో ఫోన్ సంభాషణ జరిపినట్లు సమాచారం. ఇటు మల్లికార్జున్ ఖర్గే కూడా మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. ఈ చర్యల ద్వారా దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కనుగొనే యత్నంలో తామే ముందుండాలని సోనియా అనుకున్నారు. బీజేపీయేతర పక్షాలకు సారథ్యం తామే వహించాలని, పెద్దన్న పాత్ర తమదేనని సోనియా భావించారు. కానీ ఓవైపు మమతా బెనర్జీ, ఇంకోవైపు కేసీఆర్ (KCR) … సోనియా కలలకు గండికొట్టే సంకేతాలు ముందు నుంచే కనిపించాయి. దానికి అనుగుణంగా మమతాబెనర్జీ తొలి అడుగు వేశారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంప్రదింపులకు శ్రీకారం చుడితే.. మమతా బెనర్జీ ఏకంగా తెరమీదకి వచ్చి.. 22 పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చే చర్యలకు శ్రీకారం చుట్టారు. 22 మంది అధినేతలకు లేఖలు రాశారు. జూన్ 15వ తేదీన ఢిల్లీలో కలుద్దాం రమ్మంటూ ఆహ్వానం పంపారు. ఓరకంగా చెప్పాలంటే సోనియాకు మమత షాకిచ్చారనే అనాలి. కాంగ్రెస్ పార్టీ యత్నాల్లో కలిసి రావాలని ఖర్గే ఫోన్ ద్వారా మమతను కోరిన మరునాడే ఆమె 22 మంది విపక్ష నేతలకు, ముఖ్యమంత్రులకు.. ఆఖరుకు సోనియా గాంధీకి కూడా లేఖలు రాశారు. తాను చొరవ చూపుతున్న భేటీకి రావాలని కోరారు. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి పెద్దన్న పాత్ర పోషించాలన్న విషయంపై సోనియాతో మమత పోటీ పడుతున్నారు. ఇటు కేసీఆర్ కూడా దాదాపు అదే యత్నాల్లో వున్నారు. కానీ ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో ఇనిషియేషన్ చేసుకుంటారా లేక జాతీయ పార్టీ స్థాపన తర్వాతే అడుగు ముందుకు వేస్తారా అన్నదింకా తేలలేదు. ప్రస్తుతానికి ఆసక్తి రేపుతున్న అంశాలు రెండు. ఒకటి మమత ఆహ్వానం మేరకు సోనియా గాంధీ జూన్ 15 భేటీకి కాంగ్రెస్ ప్రతినిధిని పంపుతారా లేదా ? ఇటు తానిదివరకే కొంతమందిని కలిసిన నేపథ్యంలో కేసీఆర్.. దీదీ ఆహ్వానాన్ని మన్నిస్తారా ? ఈ రెండు ప్రశ్నలిపుడు పలువురు రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్నాయి.

బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న కేసీఆర్.. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కావాలన్న లక్ష్యంతో శరద్ పవార్ (SHARAD PAVAR), దేవెగౌడ (DEVE GOWDA), కుమారస్వామి (KUMARASWAMY), ఉద్ధవ్ థాక్రే (UDDAV THAKRE), స్టాలిన్ (STALIN), అరవింద్ కేజ్రీవాల్ (ARVIND KEJRIVAL), హేమంత్ సొరేన్ (HEMANT SOREN), భగవంత్ సింగ్ మాన్ (BHAGWATH SINGH MANN) వంటి నేతలను కలిశారు. అదే క్రమంలో మమతా బెనర్జీని కలుస్తారని ప్రచారం జరిగింది. కారణాలేవైతేనేం కేసీఆర్ ఆమెను కల్వలేదు. తాజాగా కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించే యత్నాలు ప్రారంభించారు. జూన్ పదిన తన పార్టీ సీనియర్లతో భేటీ అయి.. తన యాక్షన్ ప్లాన్‌ని చూచాయగా వారికి తెలిపారు. అంతకు ఒకరోజు ముందు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో కేసీఆర్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (PRASHANT KISHORE) భేటీ అయ్యారు. ఇది ఓవైపు కొనసాగుతుండగానే.. కేసీఆర్ చాలా కాలం నుంచి చెబుతూ వస్తున్న తరహా భేటీకి మమతా ఇనిషియేషన్ తీసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే విపక్షాలను ఒక్కతాటిపై తెచ్చిన క్రెడిట్ తనకే దక్కాలని, భవిష్యత్తులో ప్రధాని అభ్యర్థిగా తానే ప్రొజెక్టు కావాలని దీదీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ అంశమే రేపు విపక్షాల ఐక్యతకు విఘాతం తెచ్చే అవకాశం వుంది. ఎందుకంటే యుపీఏ కూటమికి సారథిగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రధానిగా రాహుల్ గాంధీనే చూస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఒకవేళ ఎవరో ఒకరు కాస్త తగ్గినా .. తిరిగి సార్వత్రిక ఎన్నికలొచ్చే సరికి ప్రధాని అభ్యర్థిత్వమే విపక్ష పార్టీల ఐక్యతకు గండి కొట్టడం ఖాయం. ఇక్కడ ఎవరో ఒకరు తగ్గడం అనే ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోనియా.. ఖర్గే ద్వారా పంపుతున్న సంకేతం దీనికి బీజం వేస్తోంది. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగే వ్యక్తి విజయం సాధించడం దాదాపు కన్ఫర్మ్. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఎలక్టోరల్ కాలేజీ (PRESIDENTIAL ELECTORAL COLLEGE)లో ఎన్డీయే(NDA)కు దాదాపు సగం ఓట్లున్నాయి. కేవలం 1.2 శాతం మాత్రమే మేజిక్ ఫిగర్‌కి తక్కువుంది. దీనిని పూడ్చుకునేందుకు వైసీపీ (YCP), బీజేడీ (BJD), అన్నా డిఎంకే వంటి పార్టీలను బీజేపీ వినియోగించుకుంటుంది. బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకున్నా.. వైసీపీ, అన్నా డిఎంకే మాత్రం ఎన్డీయే అభ్యర్థికే ఓటు వేయడం దాదాపు ఖాయం. ప్రెసిడెన్షియల్ ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓట్ల విలువ 10 లక్షల 86 వేలు కాగా.. ఎన్డీయేకు 48 లక్షల 90 వేల ఓట్ల విలువ వుంది. అంటే మేజిక్ ఫిగర్‌కు 11 వేల 990 ఓట్ల విలువ తక్కువగా వుంది. అటు బీజేడీకి 13 వేల ఓట్ల వాల్యూ వుండగా.. వైసీపీ ఏకంగా 45 వేలకు పైగా ఓట్ల విలువ వుంది. ఈ రెండు పార్టీ ఏ ఒక్క పార్టీ ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇచ్చినా ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవడం ఖాయం. ఈక్రమంలో ఎన్డీయే అభ్యర్థి ఎవరన్న అంశం కీలకంగా మారుతోంది. ఈ జాబితాలో పలువురి పేర్లు వినిపిస్తుండగా.. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము పేరు ప్రబలంగా వినిపిస్తోంది. దక్షిణాది వ్యక్తికి అవకాశం ఇవ్వదలిస్తే మాత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకో, తెలంగాణ గవర్నర్ తమిళిసై లలో ఒకరికి అవకాశం దక్కొచ్చంటున్నారు. అటు విపక్షాలను ప్రసన్నం చేసుకునేందుకు సోనియా ఓ మెట్టు తగ్గినట్లు సమాచారం. ఎన్నికల బరిలో కాంగ్రెస్ నేతను కాకుండా అందరికీ ఆమోదయోగ్యుడైన ఇంకెవరినైనా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేందుకు సోనియా సన్నద్ధమవుతున్నారు. మరి మమతా బెనర్జీ నిర్వహిస్తున్న భేటీకి ఎవరెవరు హాజరవుతారు.. ? ఆమె ప్రతిపాదనలకు ఎవరెలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.