బాబుతో ఆ నలుగురు..మరి మిగిలినవాళ్లేరి?

అసెంబ్లీలో తెలుగు తమ్ముళ్లు 22 మంది ఉన్నా, ఎంత సేపూ ఆ నలుగురే కనిపిస్తున్నారు. విపక్షనేతగా చంద్రబాబు అధికారపక్షంపై చేస్తున్న పోరాటంలో ఆయన పక్కన కనిపిస్తున్నది కేవలం నలుగురే. కొంతమంది నిరుత్సాహంలో వుండిపోగా.. మరికొందరు అసలు సభకే రావటం లేదు. సభకి హాజరయ్యేవారు కూడా మొక్కుబడిగా వస్తున్నారు తప్పించి, పోరాట పటిమను ప్రదర్శించలేకపోతున్నారు. ఈ అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో వల్లభనేని […]

బాబుతో ఆ నలుగురు..మరి మిగిలినవాళ్లేరి?
Follow us

|

Updated on: Dec 13, 2019 | 7:51 PM

అసెంబ్లీలో తెలుగు తమ్ముళ్లు 22 మంది ఉన్నా, ఎంత సేపూ ఆ నలుగురే కనిపిస్తున్నారు. విపక్షనేతగా చంద్రబాబు అధికారపక్షంపై చేస్తున్న పోరాటంలో ఆయన పక్కన కనిపిస్తున్నది కేవలం నలుగురే. కొంతమంది నిరుత్సాహంలో వుండిపోగా.. మరికొందరు అసలు సభకే రావటం లేదు. సభకి హాజరయ్యేవారు కూడా మొక్కుబడిగా వస్తున్నారు తప్పించి, పోరాట పటిమను ప్రదర్శించలేకపోతున్నారు. ఈ అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో వల్లభనేని వంశీపై టీడీపీ వేటు వేసింది. ఇక మిగిలింది 22 మంది. పార్టీ అధినేత అధికార పార్టీపై చేస్తున్న పోరాటానికి కేవలం నలుగురు ఎమ్మెల్యేలే బాసటగా నిలవటం కనిపిస్తోంది. ఎప్పుడు చూసినా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడు, బెందాళం అశోక్‌లే యాక్టివ్‌గా కనిపిస్తున్నారు.

ప్రకాశం, విశాఖ జిల్లాల నుంచి లెక్కకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నా ఒక్కరూ గట్టిగా మాట్లాడడం లేదు. అప్పుడపుడూ ఎర్రన్నాయుడి కుమార్తె, ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతున్నా, తన వాణిని గట్టిగా వినిపించలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. ప్రజల సమస్యను, పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించే పయ్యావుల కేశవ్ కూడా సభకు రావటం లేదు. మొత్తం మీద సభలో వ్యక్తిగత విమర్శలు చేసినా టీడీపీ నేతలు తిప్పికొట్ట లేకపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

విశాఖజిల్లాలో కీలక నేత అయిన గంటా సోమవారం సెషన్ ప్రారంభమైతే.. శుక్రవారం దాకా అసెంబ్లీలో కనిపించలేదు. మొదటి నాలుగురోజులు ఆయన డుమ్మా కొట్టేశారు. ఆయన తన అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రకాశం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలున్నా సభలో పెద్దగా స్పందించటం లేదు. ఇక గొట్టిపాటి రవి సభకి మొదటి రోజు మాత్రమే వచ్చి ఆ తర్వాత గాయబయ్యారు. ఆయనా పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది.

ప్రకాశం నుంచి ముగ్గురు ఎమ్మల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గొట్టిపాటి రవి, కరణం బలరాం, ఏలూరి సాంబశివరావులు కూడా ముందు వైసీపీలోకి వెళదామనుకున్నారనీ, చివరికి మళ్లీ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుతో భుజం కలిపి అధికారపక్షంపై నలుగురు మాత్రమే గట్టిగా పోరాడుతున్నారు. లేటు వయసులోను అధినేత చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తుంటే.. ఆయన బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం పక్కదార్లు చూస్తున్నారని పలువురు అనుకుంటున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..