తాడేపల్లిలో నారా లోకేశ్ ధర్నా

ఎన్నికల వేళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్రిష్టియన్‌ పేట పోలింగ్‌ బూత్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ మంత్రి నారా లోకేశ్‌ ధర్నాకు దిగారు. ప్రతిగా వైకాపా శ్రేణులు సైతం నిరసనకు దిగాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెదేపా, వైకాపా వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్పీ విజయరావు సంయమనం పాటించాలని ఇరువర్గాలను సూచించారు. ఈ సందర్భంగా […]

తాడేపల్లిలో నారా లోకేశ్ ధర్నా
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2019 | 6:28 AM

ఎన్నికల వేళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్రిష్టియన్‌ పేట పోలింగ్‌ బూత్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ మంత్రి నారా లోకేశ్‌ ధర్నాకు దిగారు. ప్రతిగా వైకాపా శ్రేణులు సైతం నిరసనకు దిగాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెదేపా, వైకాపా వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్పీ విజయరావు సంయమనం పాటించాలని ఇరువర్గాలను సూచించారు.

ఈ సందర్భంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ..పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అధ్వానంగా చూశారని ఆరోపించారు. పోలింగ్‌ అధికారి తప్ప అక్కడ ఇతర అధికారులు ఎవ్వరూ లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం వచ్చి ఓటర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓటర్లను ఓటు వేయకుండా చేసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈవీఎంల సమస్య తలెత్తిందని, ఎన్నికల కమిషన్‌ లోపాల వల్లే ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. ఆలస్యంగా ప్రారంభమైన బూత్‌లలో రీపోలింగ్‌ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని అన్నారు. ప్రజల్ని ఇబ్బంది పెడుతూ తెదేపా వర్గీయులపై దౌర్జన్యాలకు పాల్పడడం వైకాపా నాయకులకు కొత్తేమీ కాదని లోకేశ్‌ విమర్శించారు.