కేటీఆర్‌కు లోకేశ్ కౌంటర్

కేటీఆర్‌కు లోకేశ్ కౌంటర్

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వంద శాతం ఓడిపోతారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీని అతలాకుతలం చేసేందుకే టీఆర్ఎస్ వస్తోందనే సంగతి కేటీఆర్ మాటల్లో తేలిపోయిందని లోకేశ్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారని విమర్శించారు. కేసీఆర్ ఆయన సహచరులకు భంగపాటు తప్పదు! ఇది తథ్యం! ట్విట్టర్‌లో లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు. […]

Vijay K

| Edited By: Srinu Perla

Mar 06, 2019 | 8:03 PM

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వంద శాతం ఓడిపోతారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీని అతలాకుతలం చేసేందుకే టీఆర్ఎస్ వస్తోందనే సంగతి కేటీఆర్ మాటల్లో తేలిపోయిందని లోకేశ్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారని విమర్శించారు. కేసీఆర్ ఆయన సహచరులకు భంగపాటు తప్పదు! ఇది తథ్యం! ట్విట్టర్‌లో లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.

” ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు అన్న విషయం ఈ రోజు @KTRTRS గారి మాటల్లో బయటపడింది. ఒక్క నాయకుడిని ఎదుర్కోలేక ముగ్గురు నాయకులు ఒక్కటై ఎన్నో కుట్రలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం లో పోటీ పడలేక, జగన్ తో చేతులు కలిపి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే భారీ ప్రణాళికలతో తెరాస ముందుకొస్తున్న విషయం ఇవ్వాళ కేటీఆర్ మాటల్లో తేలిపోయింది.తెలుగుదేశం ఓటమి కోసం కృషి చేసే కేసీఆర్ ఆయన సహచరులకు భంగపాటు తప్పదు! ఇది తథ్యం! ”

https://twitter.com/naralokesh/status/1099288525168463878

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu