ముగిసిన ఆరో దశ ఎన్నికల ప్రచారం

న్యూఢిల్లీ: ఆరోదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు గానూ మే 12న ఆరో దశలో ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో బిహార్‌లోని 8, ఢిల్లీలోని 7, హరియాణాలోని 10, ఝార్ఖండ్‌లోని 4, మధ్యప్రదేశ్‌లోని 8, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 14, పశ్చిమ బెంగాల్‌లోని 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశ ఎన్నికలు మే 19న జరుగుతాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు మొత్తం 424 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. మిగతా 118 […]

ముగిసిన ఆరో దశ ఎన్నికల ప్రచారం
Follow us

|

Updated on: May 10, 2019 | 7:01 PM

న్యూఢిల్లీ: ఆరోదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు గానూ మే 12న ఆరో దశలో ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో బిహార్‌లోని 8, ఢిల్లీలోని 7, హరియాణాలోని 10, ఝార్ఖండ్‌లోని 4, మధ్యప్రదేశ్‌లోని 8, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 14, పశ్చిమ బెంగాల్‌లోని 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశ ఎన్నికలు మే 19న జరుగుతాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు మొత్తం 424 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. మిగతా 118 స్థానాలకు గానూ ఆరు, ఏడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడవుతాయి.

ఆరో దశ ఎన్నికలు జరుగుతున్న అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలను సిద్ధం చేశారు. ఒకవేళ అవి మొరాయిస్తే వెంటనే సరిచేయడానికి నిపుణులను నియమించారు. దేశంలోని మొత్తం 543 స్థానాల్లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.