ఇప్పటికే ఆలస్యమైంది.. బీజేపీలో చేరడం ఖాయం

గతకొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరదించారు. తాను పార్టీ మారడం ఖాయమని తేల్చి చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అవుతుందన్నారు. లీగల్, టెక్నికల్ అంశాలు చూసుకుని త్వరలోనే బీజేపీలో చేరతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ షోకాజు నోటీసు.. ఇవ్వడంపై మండిపడ్డారు. తప్పు వారు చేసి.. నాకు నోటీసులు ఇవ్వడమేంటని అన్నారు. ఇన్నాళ్లు వెంటిలేషన్‌పై ఉన్న పార్టీ ఇప్పుడు చచ్చిపోయిందన్నారు. మరో 20 ఏళ్లైనా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి […]

ఇప్పటికే ఆలస్యమైంది.. బీజేపీలో చేరడం ఖాయం
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 8:38 PM

గతకొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరదించారు. తాను పార్టీ మారడం ఖాయమని తేల్చి చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అవుతుందన్నారు. లీగల్, టెక్నికల్ అంశాలు చూసుకుని త్వరలోనే బీజేపీలో చేరతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ షోకాజు నోటీసు.. ఇవ్వడంపై మండిపడ్డారు. తప్పు వారు చేసి.. నాకు నోటీసులు ఇవ్వడమేంటని అన్నారు. ఇన్నాళ్లు వెంటిలేషన్‌పై ఉన్న పార్టీ ఇప్పుడు చచ్చిపోయిందన్నారు. మరో 20 ఏళ్లైనా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని.. త్వరలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందనడంలో.. ఎలాంటి అనుమానం లేదన్నారు. రెండు సార్లు గెలిచినా.. ప్రజలకు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వచ్చే సారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీ ద్వారా ప్రజలకు సేవ చేయవచ్చన్న ఉద్దేశంతోనే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాని.. ఇప్పటికే రాంమాధవ్‌ని రెండు సార్లు కలిశానని తెలిపారు.