Janasena Chief pawan kalyan: పవన్ ‘న్యూ’ విష్… కొత్త సంవత్సరం జాతిలోని వీరత్వాన్ని మేల్కొలపాలని ఆకాంక్ష

ఈ కొత్త సంవత్సరం జాతిలోని వీరత్వాన్ని మేల్కొలపాలని కోరుకుంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Janasena Chief pawan kalyan: పవన్ ‘న్యూ’ విష్... కొత్త సంవత్సరం జాతిలోని వీరత్వాన్ని మేల్కొలపాలని ఆకాంక్ష
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
Follow us

| Edited By:

Updated on: Jan 01, 2021 | 5:25 AM

New Year 2021: ఈ కొత్త సంవత్సరం జాతిలోని వీరత్వాన్ని మేల్కొలపాలని కోరుకుంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్‌ను విడుదల చేశాడు. అందులో ఒక జాతి సరైన బాటలో నడవాలంటే, ఒక తెలివైనవాడు తెగించాలి… ఒక ధర్మం తిరిగి స్థాపించబడాలంటే, ఒక అధికారం తల తెగిపడాలి… ఒక వారసత్వం నదిలా ప్రవహించాలంటే, ఒక గురువు దీపంలా వెలగాలి… ఒక దేశం ఉద్ధరింపబడాలంటే, ఒక సందేశం యుద్ధం చేయ్యాలి…. రాజ్యాన్ని సేవించినవాడు రాముడైతే… ఆ రాజ్యాన్ని సాధించిన వాడే పరశురాముడు అంటూ సందేశాత్మక శుభాకాంక్షలు రాసుకొచ్చాడు.

జనసేనాని ట్వీట్ ఇదే…

పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు…

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దానిలో పవన్ రాస్తూ… ‘‘ ఆశావహ దృక్పథంతో ప్రవేశిస్తున్న 2021 నూతన వసంతంలో దేశ ప్రజలు, తెలుగు వారందరికి నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020లో మానవాళిని భయకంపితులను చేసిన కరోనా మహమ్మారి ప్రపంచ ప్రగతి రథ చక్రాన్ని సైతం కొన్ని నెలల పాటు నిలువరించింది. కోట్లాది మందిని ఆస్పత్రి పాలు చేసింది. లక్షలాది ప్రాణాలను చిదిమేసింది. దీనికి తోడు ప్రకృతి బీభత్సాలు సైతం వెంటాడాయి. 2020 చివరి రోజుల్లో భారీ వర్షాలు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరానికి, నివర్ తుఫాను ఆంధ్రప్రదేశ్ రైతులకు కన్నీరు మిగిల్చింది. అయితే కరోనా మహమ్మారిపై వైద్య శాస్త్రం పై చేయి సాధించింది. వాక్సిన్ రూపంలో కోవిడ్ పీచమణచగల ఆయుధం మన శాస్త్రవేత్తల కృషి ద్వారా ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. ఈ నూతన సంవత్సరంలో దేశంలోని ప్రతీ ఒక్కరికి కోవిడ్ టీకా కరోనా నుంచి రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైతులు, కౌలు రైతులు, వృత్తి నిఫుణులు, ఉద్యోగులు, కార్మికులు, కళాకారులు, అన్ని వర్ఘాలు తమ కుటుంబాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. లోక సమస్తా సుఖినోభవంతు’’ అని పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన లేఖలో పేర్కొన్నారు.

పార్టీ శ్రేణులకు రాసిన లేఖ….