హస్తం పగ్గాలు.. ప్రియాంకా చేతిలోకి..?

హస్తం పగ్గాలు.. ప్రియాంకా చేతిలోకి..?

కాంగ్రెస్ పార్టీ.. 125 ఏళ్ల చరిత్ర.. స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఉన్న అతి పురాతన పార్టీ. దాదాపు 70 ఏళ్లు దేశాన్ని పరిపాలించింది. కానీ ప్రస్తుతం అంతటి ఘన చరిత్ర ఉన్న పార్టీకి నాయకత్వానికి లోటు ఏర్పడింది. 2012-12 వరకు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో హస్తం హవానే ఉండేది. అయితే 2013 తర్వాత దేశంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకేసారి కాంగ్రెస్ పార్టీ స్కాంలు, కేసులు ఆరోపణలను ఎదుర్కొంటుండటంతో.. ప్రజా వ్యతరేకత మొదలైంది. అయితే […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Sep 14, 2019 | 3:04 PM

కాంగ్రెస్ పార్టీ.. 125 ఏళ్ల చరిత్ర.. స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఉన్న అతి పురాతన పార్టీ. దాదాపు 70 ఏళ్లు దేశాన్ని పరిపాలించింది. కానీ ప్రస్తుతం అంతటి ఘన చరిత్ర ఉన్న పార్టీకి నాయకత్వానికి లోటు ఏర్పడింది. 2012-12 వరకు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో హస్తం హవానే ఉండేది. అయితే 2013 తర్వాత దేశంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకేసారి కాంగ్రెస్ పార్టీ స్కాంలు, కేసులు ఆరోపణలను ఎదుర్కొంటుండటంతో.. ప్రజా వ్యతరేకత మొదలైంది. అయితే ఇదే అదనుగా ఎన్డీఏ గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించి 2014 ఎన్నికలకు పోటీ దిగింది. ఇంకేముంది.. డెబ్బై ఏళ్లలో ఎన్నడూ ఓటమి చూడని విధంగా కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష హోదాను కోల్పోయి.. చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కేవలం అర్ధ సెంచరీ కూడా దాటకుండా ఆగిపోయింది. ఆ తర్వాత అధ్యక్ష పదవి చేపట్టిన రాహుల్ గాంధీ.. వరుసగా విఫలమయ్యారు.

2014 తర్వాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కడ కూడా రాహుల్ గాంధీ తన ప్రాముఖ్యతను చాటుకునేలా విజయాలు సాధించలేదు. అయితే 2017-18 మధ్య పంజాబ్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీని ఓడించి మళ్లీ కాస్త పునర్వైభవం సాధించింది. అయితే ఆ తర్వాత వెంటనే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోదీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ భారీ షాక్‌లోకి మునిగిపోయింది. అయితే ఆ తర్వాత ఓటమికి అందరూ బాధ్యత వహించాల్సిందేనని.. చెప్పడంతో.. దేశ వ్యాప్తంగా పార్టీ పదవులను అంతా రాజీనామా చేశారు. అయితే రాహుల్ కొత్త కాంగ్రెస్ టీం రెడీ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారనుకున్నారు అంతా. అయితే అదే సమయంలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మొదట్లో అది వెనక్కు తీసుకునే రాజీనామానేమో అని అంతా భావించారు. అయితే రాహుల్ ఆ విషయంలో రాజీ పడకుంటా.. రాజీనామాకు కట్టుబడ్డారు. అయితే చాలా రోజులపాటు రాహుల్‌ను బుజ్జగించినా.. రాహుల్ మొండిగా వ్యవహరించడంతో చివరకు ఆ రాజీనామాను ఆమోదించారు. అయితే ఆ తర్వాత రాహుల్ స్థానంలో ఏఐసీసీ ప్రెసిడెంట్‌గా ఎవరిని నియమించాలో తర్జనభర్జనలు పడి.. చివరకు ఆ బాధ్యతలను సోనియానే చేపట్టారు. అయితే ఆమె తాత్కాలిక ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. అయితే సోనియా మాత్రం త్వరగా ఏఐసీసీ ప్రెసిడెంట్‌గా ఎవర్నైనా నియమించి.. ఆ పదవి నుంచి పక్కకు జరగాలని భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో పార్టీ కేడర్‌కు సోనియా దిశానిర్దేశం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రచారానికి దూకుడుగా వెళ్లాలని.. పార్టీ శ్రేణులకు హితబోద చేశారు. కేవలం సోషల్ మీడియా వేదికకే పరిమితం కావొద్దని సూచించారు. మోదీ పాలనలోని లొసుగులను ఆధారంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని సోనియా నేతలందరికీ తెలిపారు. అయితే ఈ క్రమంలో పార్టీకి కొత్త నాయకులు కావాలని భావిస్తున్నారు. అందుకోసం రాహుల్ గాంధీ పేరుతో పాటుగా ప్రియాంకా పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే పార్టీకి గట్టి నాయకత్వం అవసరం. అయితే రాహుల్ పేరు పరిశీలనలో ఉన్నా.. ఆ పదవిని స్వీకరించడానికి ఆయన మాత్రం దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సోనియా నిర్వహించిన సమావేశానికి రాహుల్ రాకపోవడం.. చర్చనీయాంశంగా మారింది.

వచ్చే సంస్థాగత ఎన్నికల తర్వాత.. రాహుల్ గాంధీ సుముఖతతో లేని పక్షంలో.. ప్రియాంకా గాంధీకే కాంగ్రెస్‌ పగ్గాలు అప్పజెప్పాలని పార్టీ నేతలు సోనియాపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. తాజాగా సోనియా అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ఇదే అంశం ప్రాస్తవనకు తెచ్చారని తెలుస్తోంది. అంతేకాదు రాహుల్‌, ప్రియాంకా ఇద్దరిలో ఎవరైనా ఒకరు సంస్థాగత ఎన్నికల తర్వాత నాయకత్వ బాధ్యతలు చేపట్టకపోతే.. ఇక మోదీని ఎదుర్కోవడం కష్టమన్న అభిప్రాయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన ప్రియాంకా.. ఎన్నికల ప్రచారంలో మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. సీట్లను గెలిపించుకోలేకపోయినా.. మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంలో సఫలమైందన్న అభిప్రాయంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీ చేతికి అందిస్తే.. మళ్లి పార్టీకి పునర్వైభవం వస్తుందని.. పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరి కాంగ్రెస్ కొత్త రథసారధిగా ప్రియాంక చేపడుతుందో లేదో అన్నది మరికొద్ది రోజులు వేచి చూస్తే తెలుస్తుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu