కోదండరామ్ కాంగ్రెస్ పార్టీని వద్దనుకున్నారా..?

ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు ఎక్కడున్నారు..పొలిటికల్ గా యాక్టివ్ గా లేకపోయినా సైలెంట్ గా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు. మహాకూటమితో మొన్నటి ఎన్నికల్లో ఢీ కొడతామనే రేంజ్ లో సీన్ క్రియేట్ చేశారు. అయితే ఫలితాలు ఖంగు తినిపించాయి. ఇక అప్పటి నుంచి కూటమిలో మిగతా పార్టీలతో అడపాదడపా కార్యక్రమాలు చేస్తున్న కోదండరాం..హస్తం పార్టీతో మాత్రం గ్యాప్ వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు కాంగ్రెస్ పార్టీని కోదండరాం వద్దనుకున్నారా..లేదా కోదండరామ్ నే కాంగ్రెస్ పార్టీ దూరం […]

  • Ravi Kiran
  • Publish Date - 2:24 am, Sun, 4 August 19
కోదండరామ్ కాంగ్రెస్ పార్టీని వద్దనుకున్నారా..?

ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు ఎక్కడున్నారు..పొలిటికల్ గా యాక్టివ్ గా లేకపోయినా సైలెంట్ గా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు. మహాకూటమితో మొన్నటి ఎన్నికల్లో ఢీ కొడతామనే రేంజ్ లో సీన్ క్రియేట్ చేశారు. అయితే ఫలితాలు ఖంగు తినిపించాయి. ఇక అప్పటి నుంచి కూటమిలో మిగతా పార్టీలతో అడపాదడపా కార్యక్రమాలు చేస్తున్న కోదండరాం..హస్తం పార్టీతో మాత్రం గ్యాప్ వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అసలు కాంగ్రెస్ పార్టీని కోదండరాం వద్దనుకున్నారా..లేదా కోదండరామ్ నే కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టిందా అనే చర్చ ఆసక్తికరంగా మారింది. అయితే హస్తం నేతలు ఆసక్తిగా లేకపోయినా కోదండరామే టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారట. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారట కోదండరామ్. అందుకే కమ్యూనిస్టులు, టీడీపీతో పాటు హస్తం నేతలు కూడా సహకరించాలంటున్నాడట.

అయితే మహాకూటమి ప్రయోగంతో హైకమాండ్ కూడా టీజేఏ పరిస్థితి ఏంటో తెలిసిపోయిందట. అందుకే ఆ విషయంలో కోదండరామ్ కు హామీ ఇవ్వడం లేదట. పైగా టీజేఎస్ తో కలిస్తే తమకు మేలు జరగడం కంటే తమ పార్టీ వల్లే కోదండకు లాభం జరుగుతుందనేది కాంగ్రెస్ నేతల వాదనట. అందుకే కోదండరామ్ కు దూరంగా ఉంటున్నారట టీపీసీసీ నేతలు.

మొత్తంగా మహాకూటమి పేరుతో సాదారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పై కత్తులు దూసిన కాంగ్రెస్, టీజేఎస్ హుజూరు నగర్ ఉప ఎన్నిక పోటీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్ర ఆసక్తిరేపుతోంది.