నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న ఐపిఎల్ సాంబార్ సందడి

బెంగళూరు: ఐపిఎల్ సందడి మొదలైంది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి జోష్ అందుకుంది. మర్చి 23న తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్‌సిబి జట్టు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. దక్షిణ భారత్‌లో స్పైసీ వంటకాలు ఫేమస్‌.. కానీ మేం స్వీట్‌ సాంబార్‌ను ఫ్రిఫెర్‌ చేస్తున్నాం. మన ఐపీఎల్‌ 2019 సీజన్‌ బెంగళూరుకు దూరంగా ప్రారంభం అవుతోంది’ అని చెన్నైని పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేసింది. […]

నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న ఐపిఎల్ సాంబార్ సందడి
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:54 PM

బెంగళూరు: ఐపిఎల్ సందడి మొదలైంది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి జోష్ అందుకుంది. మర్చి 23న తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్‌సిబి జట్టు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. దక్షిణ భారత్‌లో స్పైసీ వంటకాలు ఫేమస్‌.. కానీ మేం స్వీట్‌ సాంబార్‌ను ఫ్రిఫెర్‌ చేస్తున్నాం. మన ఐపీఎల్‌ 2019 సీజన్‌ బెంగళూరుకు దూరంగా ప్రారంభం అవుతోంది’ అని చెన్నైని పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేసింది.

ఇందుకు చెన్నై సూపర్ కింగ్స్ బదులిస్తూ ‘సాంబార్‌ ఎప్పుడూ పచ్చ కలర్లోనే ఉంటుంది తెలుసా?’ అంటూ సెటైర్ వేసింది. అయితే ఇది నెటిజన్లకు ఆనందాన్ని పంచింది. ఈ ట్వీట్లు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పలువురు దీనిపై స్పందిస్తూ సందడిలో పాలు పంచుకున్నారు. తోచిన కామెంట్లు పెట్టారు. బెంగళూరులో సాంబార్ ఎర్రగా ఉంటుంది కదా అని ఒకరు, సాంబార్ స్వీటుగా ఎక్కడ ఉంటుంది? కారంగా కదా ఉండేది? అని మరొకరు వ్యగ్యంగా స్పందిస్తున్నారు.