ఆ పైలాన్‌ తొలగించాలని బీజేపీ పట్టు.. క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్‌ నిరసన.. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం రసాభాసా

గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర రసాభాసకు దారి తీసింది. దీక్షా దివస్ పైలాన్ ఆవిష్కరణ పెద్ద రగడనే..

ఆ పైలాన్‌ తొలగించాలని బీజేపీ పట్టు.. క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్‌ నిరసన.. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం రసాభాసా
Follow us

|

Updated on: Feb 08, 2021 | 6:37 PM

గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర రసాభాసకు దారి తీసింది. దీక్షా దివస్ పైలాన్ ఆవిష్కరణ పెద్ద రగడనే సృష్టించింది. పైలాన్‌ తొలగించాలని బీజేపీ కార్పొరేటర్‌ అంటే అసలు ఆ మాట అన్నందుకు క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. దీంతో సమావేశంలో తీవ్ర గందరగోళం జరిగి చివరికి బీజేపీ కార్పొరేటర్ వాకౌట్‌కి దారి తీసింది.

తెలంగాణ సాధకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షకు గుర్తుగా వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఆవరణలో దీక్షా దివస్‌ పైలాన్‌ను నిర్మించారు. 10 లక్షలతో నిర్మించిన దీక్షా దివస్ పైలాన్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు.

దీక్షా దివస్ పైలాన్‌పై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. చర్చలో బీజేపీ కార్పొరేటర్ చాడ స్వాతి రెడ్డి ఈ పైలాన్‌ను తొలగించాలంటూ మాట్లాడబోయారు. దీంతో టీఆర్ఎస్‌ కార్పొరేటర్ ఆమెను అడ్డుకున్నారు. బీజేపీ కార్పొరేటర్ స్వాతి క్షమాపణ చెప్పాలంటూ టీఆర్ఎస్‌ కార్పొరేటర్లు కౌన్సిల్‌ సమావేశంలో నిరసన తెలిపారు.

తనను మాట్లాడనివ్వకుండా టీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకోవడంపై బీజేపీ కార్పొరేటర్ స్వాతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పోడియం ముందు కూర్చొని నిరసన తెలిపారు. చివరికి సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. బీజేపీ కార్పొరేటర్ తీరుపై టీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర నిరసన తెలియజేశారు

Read more:

వేప చెట్టును కొట్టేసిన వ్యక్తులకు భారీ జరిమానా.. ఎనమిదో తరగతి బాలుడి ఫిర్యాదుతో కదిలిన అటవీ శాఖ