వైసీపీ నుంచి బలవంతంగా బయటకు వచ్చేలా చేశారు: వంగవీటి

వైసీపీ నుంచి బలవంతంగా బయటకు వచ్చేలా చేశారు: వంగవీటి

వైసీపీ నుంచి తాను బలవంతంగా బయటకు వచ్చేలా ఆ పార్టీ నేతలు ప్రవర్తించారని వంగవీటి రంగ అన్నారు. వైసీపీ నుంచి ఇటీవల ఆయన బయటకు రాగా.. తాజాగా మాట్లాడుతూ ఆ పార్టీ అధినేత జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ డబ్బు, కులానికే ప్రాధాన్యత ఇస్తాడని.. అవి రెండు లేని వారిని ఆయన లెక్క చేయరని రంగ విమర్శించారు. వైసీపీకి తాను రాజీనామా చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు కానీ నిజానికి ఆ పార్టీ నుంచి బలవంతంగా […]

TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:27 PM

వైసీపీ నుంచి తాను బలవంతంగా బయటకు వచ్చేలా ఆ పార్టీ నేతలు ప్రవర్తించారని వంగవీటి రంగ అన్నారు. వైసీపీ నుంచి ఇటీవల ఆయన బయటకు రాగా.. తాజాగా మాట్లాడుతూ ఆ పార్టీ అధినేత జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ డబ్బు, కులానికే ప్రాధాన్యత ఇస్తాడని.. అవి రెండు లేని వారిని ఆయన లెక్క చేయరని రంగ విమర్శించారు. వైసీపీకి తాను రాజీనామా చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు కానీ నిజానికి ఆ పార్టీ నుంచి బలవంతంగా బయటకు వచ్చేలా వారు చేశారని రంగ ఈ సందర్భంగా చెప్పారు.

కాగా తాను ఆశించిన అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు వైసీపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో రంగ బయటకు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబుతో సంప్రదింపులు జరిపిన రంగ.. కొన్ని కారణాల వలన ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపడం లేదు. ఈ నేపథ్యంలో జనసేన నేతలతో రంగ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu