పేదల కులమే నా కులం.. విపక్షాలకు మోదీ కౌంటర్

మోదీ బీసీ కాదంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. సమాజ్‌‌వాదీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూపీని నాశనం చేశారని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక యూపీ ప్రజలకు మళ్లీ బాసటగా నిలిచిందని మోదీ అన్నారు. అధికారంలోకి రామని తెలిసే ప్రతిపక్ష పార్టీలు కులరాజకీయాలు చేస్తున్నాయని.. అందుకే నా కులంపై కూడా ఆరోపణలు గుప్పిస్తు న్నారని మోదీ అన్నారు. మోదీ ఒక కులానికి చెందిన వాడని ప్రతిపక్షాలు అంటున్నాయని.. నేను వారికి ఒకటే చెప్పాలను […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:07 pm, Sun, 12 May 19
పేదల కులమే నా కులం.. విపక్షాలకు మోదీ కౌంటర్

మోదీ బీసీ కాదంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. సమాజ్‌‌వాదీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూపీని నాశనం చేశారని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక యూపీ ప్రజలకు మళ్లీ బాసటగా నిలిచిందని మోదీ అన్నారు. అధికారంలోకి రామని తెలిసే ప్రతిపక్ష పార్టీలు కులరాజకీయాలు చేస్తున్నాయని.. అందుకే నా కులంపై కూడా ఆరోపణలు గుప్పిస్తు న్నారని మోదీ అన్నారు. మోదీ ఒక కులానికి చెందిన వాడని ప్రతిపక్షాలు అంటున్నాయని.. నేను వారికి ఒకటే చెప్పాలను కుంటున్నానని అన్నారు. పేదలది ఏ కులమో.. నేను ఆ కులానికి చెందిన వాడినే అని అన్నారు. మన్మోహన్‌‌ సింగ్‌ హయాంలో రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వం నడిచిందని.. బలహీన ప్రభుత్వం అధికారంలో ఉంటే అంతర్జాతీయంగా దేశానికి చెడ్డపేరు వస్తుందని విపక్షాలకు మోదీ చురకలంటించారు.