Huzurabad By Election: జనం నాడి.. ప్రచార గారడీ.. హుజురాబాద్ కేంద్రంగా ఏం జరిగింది..

హుజురాబాద్‌ దంగల్‌లో కింగ్‌ ఎవరు? కారు జోరు కొనసాగుతుందా? కమలం వికసిస్తుందా? ఈ రెండు కాదని హస్తం సీన్‌లోకి వస్తుందా? జనం నాడి ఎలా ఉన్నా.. ప్రచారంలో హైలైట్ అయిన అంశాలు..

Huzurabad By Election: జనం నాడి.. ప్రచార గారడీ.. హుజురాబాద్ కేంద్రంగా ఏం జరిగింది..
Huzurabad By Election
Follow us

|

Updated on: Oct 27, 2021 | 6:08 PM

హుజురాబాద్‌ దంగల్‌లో కింగ్‌ ఎవరు? కారు జోరు కొనసాగుతుందా? కమలం వికసిస్తుందా? ఈ రెండు కాదని హస్తం సీన్‌లోకి వస్తుందా? జనం నాడి ఎలా ఉన్నా.. ప్రచారంలో హైలైట్ అయిన అంశాలు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా రచ్చ చేశాయి.  హుజురాబాద్‌ బైపోల్ బరిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ ప్రచారంలో దూకుడు పెంచాయి. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త వ్యూహాలు ఎంచుకున్నారు. టీఆర్‌ఎస్‌ తరుఫున గెల్లు శ్రీనివాస్‌.. బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ పోటీలో ఉన్నారు. 2009 నుంచి హుజురాబాద్‌ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ఈటల ఈసారి బీజేపీ నుంచి బరిలో నిలిచారు. ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకుని ప్రజల్లోకి వెళ్లారు. ఆత్మగౌరవానికి అభివృద్ధి ప్రత్యామ్నాయం కాదని నినదించారు.

ఈటల ఆత్మగౌరవ నినాదానికి టీఆర్‌ఎస్‌ కౌంటర్ ఇచ్చింది. ఆయనను పార్టీలో పెంచి పెద్దచేస్తే కారు దిగి కమలం పంచన చేరి ఢిల్లీ పెద్దల దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శించింది. దళిత సాధికారతకు టీఆర్‌ఎస్‌ ప్రకటించిన దళిత బంధు కూడా పెద్ద చర్చకు దారితీసింది. అయితే పథకం అమలుకి ఈసీ బ్రేకులు వేయడంతో పార్టీల మధ్య రచ్చ రాజేసింది. నిలిపివేతకు కారణం నువ్వంటే నువ్వంటూ మాటలయుద్ధానికి దిగారు టీఆర్‌ఎస్‌-బీజేపీ నేతలు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లపై కూడా నేతల మధ్య డైలాగ్‌ వార్‌కి పీక్‌కి వెళ్లిపోయింది.

పెట్రోల్‌, డీజిల్‌ రేట్లపై బీజేపీని కార్నర్ చేసింది టీఆర్‌ఎస్. ఓ వైపు ఎడాపెడా రేట్లను పెంచేస్తూ ఓట్లు ఎలా అడుగుతారని నిలదీసింది. అటు కమలం కూడా ఘాటుగానే రిప్లయ్ ఇచ్చింది. రేట్ల పెంపులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉందని.. అది తగ్గించే దమ్ముందా అని ప్రశ్నించింది.

టీఆర్‌ఎస్‌-బీజేపీ ప్రచార హోరులో మేము సైతం అంటూ కాంగ్రెస్‌ సీన్‌లోకొచ్చి రెండు పార్టీల తీరును ఎండగట్టింది. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అంటూ విమర్శించింది. ఇలా ఎవరికి వారు బై పోల్‌లో క్యాంపెయిన్‌తో కాకపుట్టించారు. మరి ఓటరు నాడీ ఎలా ఉంది..? ఎవరిని ఆదరిస్తారన్నది తెలియాలంటే వచ్చే నెల 2 వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి: LPG Gas Prices: దీపావళి ముందే గ్యాస్ బండకు రెక్కలు.. రూ.100 వరకు పెరగొచ్చంటున్న మార్కెట్ వర్గాలు..

Covid Lockdown: థర్డ్ వేవ్ భయాలు.. దేశంలోని ఆ నగరంలో మళ్లీ లాక్‌డౌన్..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..