బీజేపీకి హ్యాండిచ్చిన పార్టీ వర్కర్లు..ఆ వెయ్యి ఓట్లు ఏమయ్యాయి..?

హుజూర్‌నగర్ ఉపఎన్నికలో బీజేపీ చతికలపడింది. ఆ పార్టీ నాయకులు చెప్పిన మాటలకు..వచ్చిన ఓట్లకు అస్సలు పొంతన కుదరడం లేదు. దేశవ్యాప్తంగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఉపఎన్నికల్లో దుమ్మురేపిన కమలం పార్టీ..తెలంగాణ ఉప ఎన్నికలో మాత్రం డీలా పడింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రేణులకు ఇచ్చిన జోష్..ఇప్పుడు పూర్తిగా నీరుగారిపోయింది. హుజూర్‌నగర్‌లో కమలానికి పోలైన చూస్తే..పైన మేమిచ్చిన ఇంట్రోకి కరెక్ట్‌గా యాప్ట్ అవుతోంది. అసలు అక్కడ బీజేపీ సభ్యత్వం తీసుకున్న ఓటర్లు కూడా ఆ పార్టీకి ఓటు […]

బీజేపీకి హ్యాండిచ్చిన పార్టీ వర్కర్లు..ఆ వెయ్యి ఓట్లు ఏమయ్యాయి..?
Follow us

| Edited By:

Updated on: Oct 25, 2019 | 12:49 PM

హుజూర్‌నగర్ ఉపఎన్నికలో బీజేపీ చతికలపడింది. ఆ పార్టీ నాయకులు చెప్పిన మాటలకు..వచ్చిన ఓట్లకు అస్సలు పొంతన కుదరడం లేదు. దేశవ్యాప్తంగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఉపఎన్నికల్లో దుమ్మురేపిన కమలం పార్టీ..తెలంగాణ ఉప ఎన్నికలో మాత్రం డీలా పడింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రేణులకు ఇచ్చిన జోష్..ఇప్పుడు పూర్తిగా నీరుగారిపోయింది.

హుజూర్‌నగర్‌లో కమలానికి పోలైన చూస్తే..పైన మేమిచ్చిన ఇంట్రోకి కరెక్ట్‌గా యాప్ట్ అవుతోంది. అసలు అక్కడ బీజేపీ సభ్యత్వం తీసుకున్న ఓటర్లు కూడా ఆ పార్టీకి ఓటు వెయ్యలేదంటే మీరు నమ్ముతారా..!. అవును ఇది పూర్తిగా వాస్తవం.  హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వం తీసుకున్న వాళ్లు..3600 మంది కాగా..పోలైనా ఓట్లు మాత్రం 2621 మాత్రమే. మిగతా ఓటర్లు ఎటువైపు మారారన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా ఉంది.

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ ఆ పార్టీ నాయకులు జబ్బలు చరుచుకున్నారు. అభ్యర్థిని మార్చడం, అదేపనిగా ప్రచారం చేయడం చూసి పలువురు రాజకీయ పండితులు సైతం ఆ పార్టీకి గౌరవప్రదమైన ఓట్లు సాధిస్తుందని భావించారు. కానీ ఫలితం మాత్రం పూర్తి నిరాశజనకంగా ఉంది. వాస్తవానికి అక్కడ బీజేపీ, కాంగ్రెస్..కుమ్మకయ్యాయని..టీఆర్‌ఎస్ ముందునుంచి వాదిస్తూ వస్తుంది. ఒకవేళ అలా జరిగిన కూడా టీఆర్‌ఎస్ మార్జిన్ తగ్గి..కాంగ్రెస్‌కు లాభం చేకూరాలి. కానీ కారు జోరు చూస్తే..అక్కడ ఏకపక్ష నిర్ణయానికి ప్రజలు మొగ్గుచూపారని స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ ఫతితాలు బీజేపీ అతి విశ్వాసానికి నిదర్శనమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా జరిగిన డ్యామేజీని గుర్తించి..రిజల్ట్‌పై పోస్టుమార్టం చేసి..పార్టీ బలోపేతానికి కృషి చెయ్యడం, కార్యకర్తల్లో మనోధైర్యం నింపడం..బీజేపీ తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది.