గంటా మౌనం వెనుక మర్మం ఏంటి..? పార్టీ వీడుతారా..? నిజమేనా..?

పిల్లలు మౌనంగా ఉన్నారంటే అలక అని అర్థం. పెద్దలు ఉన్నారంటే ధీర్గాలోచనలో ఉన్నారని అర్థం. మరి.. రాజకీయ నాయుకులు మౌనంగా ఉన్నాడంటే.. కొంపలు అంటుకున్నాయని అర్థమట. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ సైలెన్స్ చూసి షాక్ అవుతున్నారట. చివరకు అసెంబ్లీలో చంద్రబాబుకి కాస్త అండగా నిలిచేందుకు కూడా గంట నోరు విప్పడం లేదు. గోడదూకుడు వేళాయేరా అంటూ జరుగుతోన్న ప్రచారం మరింత టెన్షన్ రేపుతోందట. గంటా మౌనం వెనుక ఉన్న మర్మం […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:01 pm, Fri, 19 July 19
గంటా మౌనం వెనుక మర్మం ఏంటి..? పార్టీ వీడుతారా..? నిజమేనా..?

పిల్లలు మౌనంగా ఉన్నారంటే అలక అని అర్థం. పెద్దలు ఉన్నారంటే ధీర్గాలోచనలో ఉన్నారని అర్థం. మరి.. రాజకీయ నాయుకులు మౌనంగా ఉన్నాడంటే.. కొంపలు అంటుకున్నాయని అర్థమట. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ సైలెన్స్ చూసి షాక్ అవుతున్నారట. చివరకు అసెంబ్లీలో చంద్రబాబుకి కాస్త అండగా నిలిచేందుకు కూడా గంట నోరు విప్పడం లేదు. గోడదూకుడు వేళాయేరా అంటూ జరుగుతోన్న ప్రచారం మరింత టెన్షన్ రేపుతోందట. గంటా మౌనం వెనుక ఉన్న మర్మం ఏంటి..?

అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ దూకుడికి ధీటుగా పెర్ఫామెన్స్ ఇవ్వడానికి టీడీపీ.. కిందా మీదా పడుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ అయిన గంటా శ్రీనివాస్ జగన్ ప్రభుత్వం మీద ఎదురు దాడికి దిగకపోవడం రాజకీయ వర్గాలను ఆకర్షిస్తోందట.

కాగా.. ఇప్పటికే గంటా శ్రీనివాస్ బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆయన దాన్ని కూడా ఖండించారు. గంటా.. ఏ పార్టీలో ఉన్నా.. మంత్రిగా ఉండటం ఆయనకు అలవాటు. అయితే.. ఎప్పుడు పార్టీ మారినా.. సింగిల్‌గా జంప్ చేయరు.. ఆయనతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలను వెంట తీసుకుపోతారు.

నిజంగానే గంటా సైకిల్ దిగి.. కమలం పువ్వు వైపు అడుగేస్తారా..? వెళ్తే.. వైసీపీ పెరట్లోకా..? బీజేపీ వాకిట్లోకా..? అన్న ప్రశ్నమరో వైపు పార్టీలో అలజడి రేపుతోందట. మరి.. గంటా మౌనపత్రం ఇంకెన్నాళ్లు అన్నది జరగబోయే రాజకీయమే తేల్చాలి.