టీడీపీలో చేరిన కిశోర్‌ చంద్రదేవ్‌

టీడీపీలో చేరిన కిశోర్‌ చంద్రదేవ్‌

అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన కిశోర్‌ చంద్రదేవ్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు విజయనగరం, విశాఖ జిల్లాల్లోని ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తెదేపాలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీని ఇటీవలే వీడిన కిశోర్‌ చంద్రదేవ్‌.. తెదేపాలో చేరుతున్నట్లు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు […]

Ram Naramaneni

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:39 PM

అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన కిశోర్‌ చంద్రదేవ్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు విజయనగరం, విశాఖ జిల్లాల్లోని ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తెదేపాలో చేరారు.

కాంగ్రెస్‌ పార్టీని ఇటీవలే వీడిన కిశోర్‌ చంద్రదేవ్‌.. తెదేపాలో చేరుతున్నట్లు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఉన్న కిశోర్‌ చంద్రదేవ్‌.. ఐదుసార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. 2011 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో గిరిజన వ్యవహరాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu