ఇల్లు వెతుక్కుంటున్న చంద్రబాబు..!

మాజీ సీఎం చంద్రబాబు ఇల్లు మారబోతున్నారా..? ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో తప్పనిసరి పరిస్థితి ఏర్పడనుందా..? ఒక వేళ అదే జరిగితే బాబు ఎక్కడ ఉండబోతున్నారు. ఇప్పుడు ఇదే న్యూస్.. టీడీసీ సహా అమరావతి వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. కృష్ణా నది కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమంటూ.. కూల్చివేసింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్‌హాస్‌కు నోటీసులు జారీ చేసింది. పైగా గెస్ట్‌హాస్‌కు పక్కన ఉన్న తమ స్థలాన్ని గతంలో తీసుకుని.. […]

ఇల్లు వెతుక్కుంటున్న చంద్రబాబు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 03, 2019 | 12:52 PM

మాజీ సీఎం చంద్రబాబు ఇల్లు మారబోతున్నారా..? ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో తప్పనిసరి పరిస్థితి ఏర్పడనుందా..? ఒక వేళ అదే జరిగితే బాబు ఎక్కడ ఉండబోతున్నారు. ఇప్పుడు ఇదే న్యూస్.. టీడీసీ సహా అమరావతి వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. కృష్ణా నది కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమంటూ.. కూల్చివేసింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్‌హాస్‌కు నోటీసులు జారీ చేసింది. పైగా గెస్ట్‌హాస్‌కు పక్కన ఉన్న తమ స్థలాన్ని గతంలో తీసుకుని.. రెండేళ్ల తరువాత అప్పగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. చంద్రబాబు గెస్ట్‌హాస్‌ను ప్రభుత్వం తొలగించబోతుందని.. ఆయన ఇల్లు ఖాళీ చేయడం మంచిదంటూ ప్రభుత్వ మంత్రులు కూడా పదేపదే సూచిస్తున్నారు. ఈ క్రమంలో బాబు.. లింగమనేని గెస్ట్‌హాస్‌ను ఖాళీ చేయడం ఖాయమని తెలుస్తోంది.

ఇప్పుడు హాట్‌టాపిక్‌ అంతా నెక్ట్స్ చంద్రబాబు ఎక్కడ ఉంటారనేదే. అయితే.. ఆయన వెలగపూడి మాజీ సర్పంచ్ శాంతకుమారి ఇంట్లో ఉండవచ్చని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ నేత, దేవినేని ఉమా, చంద్రబాబు పీఏ శాంతకుమారి ఇంటిని పరిశీలించారని తెలుస్తోంది. ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండటంతో పాటు.. ఇటు సెక్రటేరియెట్, అటు.. గుంటూరు టీడీపీ ఆఫీస్‌కు అందుబాటులో ఉంటుందని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..