దేశ రాజకీయాలపై.. 2019 ఫ్లాష్ బ్యాక్ హైలెట్స్!

ముగుస్తోన్న ఈ సంవత్సరంలో దేశ రాజకీయాల్లో సంభవించిన కొన్ని ముఖ్య ఘటనలు ఒక్కసారి గుర్తుకుతెచ్చుకుంటే.. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ చేసిన తీర్పు ఈ సంవత్సరంలో హైలెట్‌గా నిలిచింది. దీంతో పాటు జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కశ్మీర్‌లో శాశ్వత నివాసులు.. ఎవరో నిర్ణయించే అధికారాన్ని ఆ ఆర్టికల్ ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చింది. జమ్మూకాశ్మీర్‌ను పూర్తిస్థాయిలో భారతదేశంలో […]

దేశ రాజకీయాలపై.. 2019 ఫ్లాష్ బ్యాక్ హైలెట్స్!
Follow us

| Edited By:

Updated on: Dec 24, 2019 | 6:33 PM

ముగుస్తోన్న ఈ సంవత్సరంలో దేశ రాజకీయాల్లో సంభవించిన కొన్ని ముఖ్య ఘటనలు ఒక్కసారి గుర్తుకుతెచ్చుకుంటే.. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ చేసిన తీర్పు ఈ సంవత్సరంలో హైలెట్‌గా నిలిచింది. దీంతో పాటు జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కశ్మీర్‌లో శాశ్వత నివాసులు.. ఎవరో నిర్ణయించే అధికారాన్ని ఆ ఆర్టికల్ ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చింది. జమ్మూకాశ్మీర్‌ను పూర్తిస్థాయిలో భారతదేశంలో అంతర్భాగంగా మార్చివేసింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, లడఖ్ మూడు మూడు భాగాలుగా చెలామణీలోకి వచ్చాయి. అలాగే.. వివాదాస్పదమైన ట్రిపుల్ తలాఖ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. దేశవ్యాప్తంగా మొదట్లో లోక్‌సభలో దీనిని ఆమోదించగా ఆ తరువాత రాజ్యసభలో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ బిల్లుకు ఆమోదం లభించింది.

UP Woman Allegedly Given Triple Talaq after She Asked Husband for Rs 30 to Buy Medicines

అలాగే.. అక్రమ శరణార్థులను ఏరివేసేందుకు అస్సాంలో ఎన్నార్సీని అమలు చేసింది మోడీ ప్రభుత్వం. జాతీయ పౌర జాబితా నుంచి 19 లక్షల మంది పేర్లను తొలగించింది. దీంతో.. ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇక ఆ వెంటనే.. కేంద్రం సవరించిన పౌరసత్వ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, దేశాల్లో వేధింపులను ఎదుర్కొంటున్న ముస్లిమేతరులకు (హిందువులు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు) భారతీయ పౌరసత్వం కల్పించడానికి ఉద్ధేశించినదే ఈ చట్టం. అయితే ఇది దేశంలో భారీ ఎత్తున ఆందోళనలు, నిరసనలకు కారణమైంది. కాగా.. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో దశాబ్దాల నాటి ఈ కేసు ఓ కొలిక్కివచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ముస్లిం సంఘాలు వేసిన రివ్యూ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. దీంతో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది.

కాగా.. ఇక మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం, కర్ణాటకలో కుమార స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం పతనమై బీజేపీ నేత యడియూరప్ప ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడటం ప్రధాన ఘట్టాలయ్యాయి. తాజాగా ఝార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఆ పార్టీకి శరాఘాతమైంది. ఈ రాష్ట్రంలో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి విజయ కేతనం ఎగురవేసింది.

ఏపీ:

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘన విజయం సాధించి, టీడీపీని ఓడించింది. మరోవైపు జరిగిన ముఖ్యమైన ఘట్టం మూడు రాజధానుల ఏర్పాటుపై అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన. ఇది పెద్ద వివాదాన్నే సృష్టించింది. అమరావతిలో లెజిస్లేచర్, విశాఖలో అడ్మినిస్ట్రేషన్, కర్నూలులో జ్యుడిషియల్ ఏర్పాటు నిర్ణయాలు. అంతకు ముందు ప్రభుత్వంలో గ్రామ సచివాలయాల ఏర్పాటు, పోలవరం రివర్స్ టెండరింగ్, ఆర్టీసీ విలీనం, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది గుర్తింపు నిర్ణయాలు ప్రధానమైనవి. కాగా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో.. ఢిల్లీలో నిర్వహించిన ధర్మపోరాట దీక్ష ఈ సంవత్సరం మొదటిలో హైలెట్‌గా నిలిచింది.

తెలంగాణ:

తెలంగాణాలో ఈ ఏడాది ప్రధానంగా చెప్పుకోదగ్గ ఘటన దాదాపు 46 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మె. తమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నది కార్మికుల ప్రధాన డిమాండ్. అయితే ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో.. వారు దాదాపు రెండు నెలలపాటు సమ్మె చేశారు. చివరకు వారి డిమాండ్లలో కొన్నింటికి పభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారి రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచేందుకు అంగీకరించింది. దాంతో పాటు సమ్మె కాలానికి గానూ వారికి పూర్తి జీతం ఇచ్చేందుకు కూడా సమ్మతించింది. దీంతో.. ఉద్యోగులు సమ్మె విరమణను పాటించి, తిరిగి విధుల్లో చేరడంతో శుభం కార్డు పడింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు.. సుమారు 80 వేల కోట్ల ఈ ప్రాజెక్టును రీ డిజైన్ చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. జూన్ 20న ఈ ప్రాజెక్ట్ ఆ రాష్ట్రానికి సేవలందించేందుకు సిద్ధమైంది. అలాగే.. పరుగులు పెడుతూ మెట్రో కూడా ప్రజలకు సేవలందిస్తూ హైలైట్‌గా నిలిచింది.