బాబు నోట బూతు మాట… షాకైన జనం

ఒకప్పుడు రాజకీయాల్లో హుందాతనం వుండేది. విమర్శలు చేసుకున్నా మాటలు హద్దులకు లోబడి వుండేవి. కానీ ఇపుడు పరిస్థితి మారిపోయింది. హుందాతనం అనే మాటను పూర్తిగా పక్కన పెట్టి చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా.. సీనియర్.. జూనియర్ అన్న గౌరవం లేకుండా విమర్శలు, ఆరోపణలు హద్దుమీరుతున్నాయి. ఇంకా చెప్పాలంటే బూతు బాగోతాలు ప్రస్తుత రాజకీయాల్లో సర్వ సాధారణమైపోయాయి. కానీ తాజాగా జరిగిన పరిణామమే.. ఒకింత ఆశ్చర్యాన్ని.. మరింత అసహ్యాన్ని కలిగిస్తోంది. దాదాపు 15 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన […]

బాబు నోట బూతు మాట... షాకైన జనం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 04, 2019 | 12:44 PM

ఒకప్పుడు రాజకీయాల్లో హుందాతనం వుండేది. విమర్శలు చేసుకున్నా మాటలు హద్దులకు లోబడి వుండేవి. కానీ ఇపుడు పరిస్థితి మారిపోయింది. హుందాతనం అనే మాటను పూర్తిగా పక్కన పెట్టి చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా.. సీనియర్.. జూనియర్ అన్న గౌరవం లేకుండా విమర్శలు, ఆరోపణలు హద్దుమీరుతున్నాయి. ఇంకా చెప్పాలంటే బూతు బాగోతాలు ప్రస్తుత రాజకీయాల్లో సర్వ సాధారణమైపోయాయి. కానీ తాజాగా జరిగిన పరిణామమే.. ఒకింత ఆశ్చర్యాన్ని.. మరింత అసహ్యాన్ని కలిగిస్తోంది.

దాదాపు 15 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేత, 24 ఏళ్ళుగా ఒక ప్రాంతీయ పార్టీకి సారథ్యం వహిస్తున్న నాయకుడి నోటి వెంట బూతు మాటలు వినిపించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఆ మాటలు తాను అనకపోయినా.. వేరే వాళ్ళు తమ మహిళా నేతను ఇలా అన్నారంటూ ఆయన నోటి వెంట బూతు మాటలు రావడంతో కొన్ని ఛానళ్ల లైవ్ చూస్తున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన టిడిపి అధినేత చంద్రబాబు.. ఒకానొక సందర్భంలో ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు టిడిపి మహిళా నేత పసుమర్తి అనురాధ నుద్దేశించి సోషల్ మీడియాలో అతి దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఆమెనుద్దేశించి ప్రస్తావించిన బూతు మాటలన్నీ తాను స్వయంగా ప్రస్తావించారు. లైవ్ చూస్తున్న వారు ఉన్నట్లుండి ఉలిక్కి పడ్డారు.

విషయాన్ని ఎండ గట్టే క్రమంలో తాను స్వయంగా అలాంటి పద ప్రయోగం చేయడం చంద్రబాబు హుందాతనానికి సరి కాదని పలువురు కామెంట్ చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా చంద్రబాబు ప్రయోగించిన భాషపై, వాడిన పదజాలంపై పెద్ద ఎత్తున ఎంక్వైరీలు చేశారు. పలు ఛానళ్లకు కాల్ చేసి.. చంద్రబాబు అసలేం కామెంట్ చేశారని వాకబు చేశారు. విజయసాయి రెడ్డి లాంటి వారైతే చంద్రబాబు అసహనం కోల్పోయారంటూ కామెంట్ చేశారు. తనయడు లోకేశ్ సోషల్ మీడియాలో ఉపయోగించే భాషను కూడా చంద్రబాబు ఒకసారి చూసుకోవాలని చంద్రబాబుకు చురకలంటించారు.

మొత్తానికి అధినేత నోటి వెంట జాలువారిన బూతు పదజాలం ఏపీ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించినట్లయ్యింది. ముందు ముందు బాబును ఆదర్శంగా తీసుకుని బూతు పురాణాన్ని వల్లిస్తారో వేచి చూడాల్సిందే.