YS Sharmila: రాజన్న తనయకు గుడ్‌ న్యూస్‌.. వైఎస్సార్ టీపీకి ఎన్నికల సంఘం గుర్తింపు..

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ సుమారు ఏడాది క్రితం పార్టీని స్థాపించింది దివంగత వైఎస్సార్‌ తనయురాలు వై.ఎస్‌.షర్మిల (Y.S. Sharmila)

YS Sharmila: రాజన్న తనయకు గుడ్‌ న్యూస్‌.. వైఎస్సార్ టీపీకి ఎన్నికల సంఘం గుర్తింపు..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 24, 2022 | 9:34 AM

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ సుమారు ఏడాది క్రితం పార్టీని స్థాపించింది దివంగత వైఎస్సార్‌ తనయురాలు వై.ఎస్‌.షర్మిల (Y.S. Sharmila). 2021 జులై 9న అధికారికంగా సభ పెట్టి వైఎస్సార్‌ టీపీని స్థాపించి జెండా, అజెండా ప్రకటించింది. అనంతరం పార్టీ పేరు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుంది. అయితే షర్మిల పార్టీని గుర్తించవద్దని, వైఎస్సార్‌ పేరు మీద పార్టీని ప్రకటించడంపై తమకు అభ్యంతరాలున్నాయంటూ కోర్టు మెట్లెక్కారు. ఈసీకి లేఖలు రాశారు. దీంతో ఇప్పటివరకు షర్మిల పార్టీకి ఈసీ నుంచి గుర్తింపు రాలేదు. దీంతో ఆమె తన తండ్రి పేరుతో పార్టీని కొనసాగిస్తారా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు హోదాలో విజయమ్మ షర్మిల పార్టీపై తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవని లేఖలు రాసింది. అయినా ఎన్నికల సంఘం స్పందించ లేదు.

మా విజయానికి తొలిమెట్టు..

అయితే తాజాగా ఈసీ నుంచి షర్మిలకు లేఖ అందింది. పార్టీ రిజిస్ట్రేషన్‌ పూర్తయినట్లు ఆ లేఖ సారాంశం. దీంతో ఇప్పటివరకు షర్మిల పార్టీపేరు పై కొనసాగిన డైలామాకు తెరపడింది. కాగా తమ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు రావడంపై హర్షం వ్యక్తం చేశారు షర్మిల. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేకు కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం సోషల్‌ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది. ‘ YSR తెలంగాణ పార్టీకి భారత ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. మా విజయానికిది తొలిమెట్టుగా భావిస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాసమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. వైఎస్సార్‌ స్ఫూర్తితో ప్రజారంజక పాలన అందించేందుకు కృషి చేస్తాం’ అంటూ అందులో రాసుకొచ్చింది.

Also Read:Andhra Pradesh: ఘరానా ముఠా బీభత్సం.. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే భారీ చోరీ.. ఇంతకీ ఏం ఎత్తుకుపోయారంటే..

Ys Viveka: మరో టర్న్ తీసుకున్న వైఎస్ వివేకా హత్య కేసు.. వెలుగులోకి ఊహించని ట్విస్టులు..

Online Games: లూడో, పోకర్, రమ్మీ.. దేశంలో దుమ్ము రేపుతున్న ఆన్‌లైన్ ఆటలు.. గేమింగ్ ముసుగులో బెట్టింగ్ మాఫియా..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..