మీనాక్షీ దేవత రూపంలో నామినేషన్ వేసిన ట్రాన్స్‌జెండర్

మీనాక్షీ దేవత రూపంలో నామినేషన్ వేసిన ట్రాన్స్‌జెండర్

తమిళనాడు : ఇది ఎన్నికల సమయం. ఇప్పుడు దేశమంతా ఎన్నికలపైనే చర్చ. మే 23 దాకా దేశంలో ఎన్నికల మీదనే చర్చ నడుస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఓవైపు అభ్యర్థులు ప్రచారం చేస్తూనే.. ఓటర్లను ఆకర్షిస్తూనే మరోవైపు నామినేషన్లు వేస్తున్నారు. తాజాగా భారతి కన్నమ్మ అనే ట్రాన్స్‌జెండర్ మీనాక్షీ దేవత అవతారంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ వేసింది. తమిళనాడులోని మదురై ఎంపీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేసింది. ఆమె హిందూ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 23, 2019 | 3:45 PM

తమిళనాడు : ఇది ఎన్నికల సమయం. ఇప్పుడు దేశమంతా ఎన్నికలపైనే చర్చ. మే 23 దాకా దేశంలో ఎన్నికల మీదనే చర్చ నడుస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఓవైపు అభ్యర్థులు ప్రచారం చేస్తూనే.. ఓటర్లను ఆకర్షిస్తూనే మరోవైపు నామినేషన్లు వేస్తున్నారు. తాజాగా భారతి కన్నమ్మ అనే ట్రాన్స్‌జెండర్ మీనాక్షీ దేవత అవతారంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ వేసింది. తమిళనాడులోని మదురై ఎంపీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేసింది. ఆమె హిందూ దేవత అవతారం ధరించగా.. ఆమెతో పాటు ముస్లిం, క్రిస్టియన్ కమ్యూనిటీల డ్రెస్సులు వేసుకొన్న ఇద్దరు వ్యక్తులు నామినేషన్‌లో ఆమెకు తోడుగా వెళ్లారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ ఆర్ గోపాలకృష్ణన్‌కు పోటీగా ఆమె బరిలోకి దిగుతోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu