డీఎంకెతో కాంగ్రెస్ పొత్తు ఖరారు

డీఎంకెతో కాంగ్రెస్ పొత్తు ఖరారు

చెన్నై: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. డీఎంకె పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఖారారైంది. నేడు ఢిల్లీలో డీఎంకే నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో తమిళనాడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ భేటీ అయ్యారు. ఈ చర్చల అనంతరం స్టాలిన్, ముకుల్ వాస్నిక్ పొత్తు ప్రకటన చేశారు. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలకు […]

Vijay K

| Edited By: Ram Naramaneni

Oct 08, 2020 | 8:39 PM

చెన్నై: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. డీఎంకె పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఖారారైంది. నేడు ఢిల్లీలో డీఎంకే నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో తమిళనాడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ భేటీ అయ్యారు. ఈ చర్చల అనంతరం స్టాలిన్, ముకుల్ వాస్నిక్ పొత్తు ప్రకటన చేశారు.

తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలకు గాను పుదుచ్చేరితో కలిపి 10 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. 20కి పైగా స్థానాల్లో డీఎంకే పోటీ చేయనుంది. మిగిలిన సీట్లను కూటమి భాగస్వామ్య పక్షాలైన ఎండీఎంకే, సీపీఎం, వీసీకే, ఎంఎంకేలకు కేటాయించనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే.. నేడు కాంగ్రెస్, డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu