వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది.. వారు జోక్యం చేసుకోవాలన్న దేవినేని ఉమ

ఏపీలో తొలిద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఇటు హైకోర్టు, అటు సుప్రీకోర్టులో కూడా ఎస్‌ఈసీకి అనుకూలంగా తీర్పు రావడంతో..

వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది.. వారు జోక్యం చేసుకోవాలన్న దేవినేని ఉమ
Follow us

|

Updated on: Jan 25, 2021 | 3:25 PM

ఏపీలో తొలిద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఇటు హైకోర్టు, అటు సుప్రీకోర్టులో కూడా ఎస్‌ఈసీకి అనుకూలంగా తీర్పు రావడంతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దూకుడు పెంచారు. ఈ నేప‌థ్యంలో అధికార, పత్రిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వం రాజ్యాంగ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతోందని టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావు ఆరోపించారు.

టీడీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేయ‌డానికి వెళ్లారని, వాటిని స్వీక‌రించ‌డానికి అధికారులు లేరని దేవినేని ఉమ అన్నారు. దీనిపై వెంట‌నే రాష్ట్ర‌ప‌తి‌, గ‌వ‌ర్న‌ర్ లు స్పందించాలని కోరారు. ఏపీలో స్థానిక సంస్థ ఎన్నిక‌లు ఎలాంటి ఆటంకాలు లేకుండా స‌క్ర‌మంగా నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని దేవినేని ఉమ కోరారు.

పెట్రో ధ‌ర‌ల‌పై కూడా దేవినేని ఉమ ట్విట్టర్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘పెట్రోల్, డీజిల్ ధరల్లో దక్షిణాదిలో ఏపీ నెంబర్ వన్.. దేశంలో మూడోస్థానం. అదనపు వ్యాట్, రోడ్ల పన్నులంటూ భారీగావడ్డింపు, సీఎన్జీనీ వదలని వైనం. చంద్ర‌బాబు నాయుడి హయాంలో అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న ఏపీని నేడు అప్పుల్లోకి తెచ్చారు. పన్నులు వేయడంలో అగ్రగామిగా నిలిపారు. దీంతో దేశం మొత్తం మనవైపు చూసేలా చేసినమాట వాస్తవంకాదా?’ అని దేవినేని ఉమ ట్వీట్‌ చేశారు.

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం