నమో టీవీలో ప్రచారం.. బీజేపీకి నోటీసులు

ఆరో దశ ఎన్నికలకు శుక్రవారంతో ప్రచార గడువు ముగిసింది. అయితే ప్రచార సమయం పూర్తయిన తర్వాత కూడా నమో టీవీలో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రసారం చేయడంతో ఢిల్లీ ఎన్నికల సంఘం బీజేపీకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఎన్నికల ప్రధాన అధికారి రణ్‌బీర్‌ సింగ్‌ ఆదేశించారు. కాగా, ఢిల్లీలో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడింది. మళ్లీ ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి […]

నమో టీవీలో ప్రచారం.. బీజేపీకి నోటీసులు
Follow us

| Edited By:

Updated on: May 11, 2019 | 7:47 PM

ఆరో దశ ఎన్నికలకు శుక్రవారంతో ప్రచార గడువు ముగిసింది. అయితే ప్రచార సమయం పూర్తయిన తర్వాత కూడా నమో టీవీలో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రసారం చేయడంతో ఢిల్లీ ఎన్నికల సంఘం బీజేపీకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఎన్నికల ప్రధాన అధికారి రణ్‌బీర్‌ సింగ్‌ ఆదేశించారు. కాగా, ఢిల్లీలో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడింది. మళ్లీ ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. అయితే నిన్న రాత్రి బీజేపీకి చెందిన నమోటీవీలో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమం ప్రసారం అయినట్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో సీఈవో నోటీసులు జారీ చేశారు.